NTV Telugu Site icon

IPL Retention 2025: దీపావళి రోజే రిటెన్షన్ జాబితా.. ఫ్రీగా లైవ్ ఎక్కడ చూడొచ్చో తెలుసా?

Ipl Retention 2025 Live

Ipl Retention 2025 Live

ఐపీఎల్ 2025కు ముందు మెగా వేలం జరగనుంది. వేలంకు సంబందించిన రిటెన్షన్ పాలసీని ఐపీఎల్ పాలక మండలి ఇప్పటికే ప్రకటించింది. ఆర్‌టీఎంతో కలిసి మొత్తంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్‌డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లను తీసుకోవాలి. విదేశీ ఆటగాళ్ల విషయంలో ఎలాంటి పరిమితులు లేవు. రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ప్రాంఛైజీలు అక్టోబరు 31లోపు సమర్పించాలి. తుది గడువుకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండడంతో ఇప్పటికే ప్రాంఛైజీలు రిటెన్షన్ జాబితాలను సిద్ధం చేసుకున్నాయి.

10 ప్రాంచైజీల రిటెన్షన్ జాబితాలను ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ ఛానెల్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అలానే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియో సినిమాలో కూడా లైవ్ చూడొచ్చు. రిటెన్షన్ జాబితాలకు సంబంధించి తాజాగా స్టార్‌స్పోర్ట్స్, జియో సినిమాలు ఓ ప్రోమోను రిలీజ్ చేశాయి. అక్టోబర్ 31 సాయంత్రం 4.30 గంటల నుంచి రిటెన్షన్ జాబితాలను ప్రకటిస్తామని పేర్కొన్నాయి. జియో సినిమాలో ఈ లైవ్‌‌ను ఫ్రీగా వీక్షించవచ్చు. స్టార్‌స్పోర్ట్స్ ఛానెల్స్‌లో చూడాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే.

Also Read: IPL Retention 2025: గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి బిగ్ అప్‌డేట్.. కెప్టెన్ అతడే!

నవంబర్ 30న మెగా వేలం నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. రిటైన్ చేసుకునే ముగ్గురు ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మరో ఇద్దరిని రిటైన్ చేసుకోవాలంటే రూ.18 కోట్లు, రూ.14 కోట్లు ఖర్చు చేయాలి. అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లకు రూ.4 కోట్లు చెల్లించాలి. ఈసారి టీమ్ పర్స్ వాల్యూను రూ.120 కోట్లకు పెరిగింది. రిటెన్షన్ జాబితాల కోసం ఫాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.