Site icon NTV Telugu

IPL Auction 2024: ఐపీఎల్ 2024 వేలంలో రికార్డు ధ‌ర ప‌లికేది వీరికే.. ప్రపంచక‌ప్ హీరో కంటే ర‌వీంద్రకే ఎక్కువ!

Ipl Auction 2024 New

Ipl Auction 2024 New

R Ashwin Says Travis Head Get 4 Crores in IPL Auction 2024: ఐపీఎల్‌ 2024 మినీ వేలానికి సర్వం సిద్దమైంది. మంగళవారం దుబాయ్‌ వేదికగా ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌ వేలం జరగనుంది. ఈ వేలంలో భారత్‌తో సహా 12 దేశాల నుంచి మొత్తం 333 మంది ప్లేయర్స్ పాల్గొననున్నారు. ప్రస్తుతం 10 జట్లలో 77 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వేలంలో కోట్లు కొల్ల‌గొట్టేది ఎవ‌రు? అని మాజీ క్రికెట‌ర్ల‌తో పాటు ఫాన్స్ జోరుగా చ‌ర్చించుకుంటున్నారు. తాజాగా వెటరన్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ మినీ వేలంలో అత్య‌ధిక ధ‌ర పలికేది ఎవ‌రో జోస్యం చెప్పాడు. యాష్ జోస్యం ప్రకారం వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో ట్రావిస్ హెడ్ కంటే న్యూజిలాండ్ యువ ఓపెన‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర భారీ ధరకు అమ్ముడుపోతాడట.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఆర్ అశ్విన్ క్రికెట్ షాట్లు ఆడుతూ ఐపీఎల్‌ 2024 మినీ వేలంలో ఎవ‌రు ఎంత ధ‌రకు అమ్ముడుపోతారో అంచనా వేశాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్‌, స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ రూ. 14 కోట్లకు పైనే ధర పలుకుతారని యాష్ చెప్పాడు. భార‌త యువ ఆటగాడు షారుక్ ఖాన్‌, శ్రీలంక మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌నిందు హ‌స‌రంగ‌లు రూ. 10 నుంచి 14 కోట్ల వరకు అమ్ముడవుతారని పేర్కొన్నాడు. భార‌త పేస‌ర్ హ‌ర్ష‌ల్ ప‌టేల్, ద‌క్షిణాఫ్రికా పేస్ సంచ‌ల‌నం గెరాల్డ్ కొయెట్జీలు రూ. 7-10 కోట్ల మధ్య అమ్ముడుపోతార‌ని అశ్విన్ తెలిపాడు.

Also Read: IPL Auction 2024: ఐపీఎల్ 2024 వేలంకు మహిళా ఆక్షనీర్‌.. ఇదే మొదటిసారి!

వ‌న్డే ప్రపంచక‌ప్‌ 2023లో అద్భుత ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ యువ ఓపెన‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర, భార‌త పేస‌ర్ ఉమేశ్ యాద‌వ్, వెస్టిండీస్ విధ్వంస‌క ఆటగాడు రొవ్‌మ‌న్ పావెల్ రూ.4 నుంచి 7 కోట్ల ధ‌ర ప‌లికే అవ‌కాశ‌ముంద‌ని ఆర్ అశ్విన్ అంచనా వేశాడు. ఆస్ట్రేలియా ప్రపంచక‌ప్ హీరో ట్రావిస్ హెడ్ రూ.4 కోట్ల వ‌ర‌కూ ప‌లుకుతాడ‌ని య‌శ్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా ప్రపంచక‌ప్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన హెడ్ కేవలం 4 కోట్లకే అమ్ముడవుతాడా? అని యాష్‌ని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ వేలంలో హెడ్ భారీ ధరకు అమ్ముడుపోతాడనే అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.

 

Exit mobile version