NTV Telugu Site icon

IPL 2024 Auction: చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో సిరిసిల్ల కుర్రాడు!

Aravelly Avinash Rao

Aravelly Avinash Rao

CSK Buy Telangana Cricketer Aravelly Avinash Rao in IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌ కోసం జరిగిన వేలంలో తెలంగాణకు చెందిన క్రికెటర్‌కు అవకాశం దక్కింది. మంగళవారం జరిగిన వేలంలో సిరిసిల్లకు చెందిన అరవెల్లి అవనీశ్ రావును చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ కొనుగోలు చేసింది. అవనీశ్‌ని అతడి కనీస ధర రూ. 20 లక్షలకు చెన్నై తీసుకుంది. వేలం చివర్లలో ఈ 18 ఏళ్ల హర్డ్ హిట్టర్, వికెట్ కీపర్‌ని సీఎస్‌కే కొనుగోలు చేసింది.

అవనీశ్‌ రావుది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామం. దక్షిణాఫ్రికాలో వచ్చే ఏడాది ఆరంభమయ్యే అండర్-19 ప్రపంచకప్‌కు అవనీశ్ ఎంపికయ్యాడు. అవనీశ్‌ వికెట్‌కీపర్‌ కమ్ బ్యాటర్‌. ఈ ఏడాది నవంబర్‌లో అండర్‌-19 నాలుగు జట్ల టోర్నీలో భారత్‌-ఏ తరఫున ఆడిన అవనీశ్.. భారత్‌-బిపై 93 బంతుల్లో 163 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతడు 12 సిక్సర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్‌కు ఫిదా అయినా చెన్నై మేనేజ్‌మెంట్ వేలంలో అతడిని కొనుగోలు చేసింది. ఇటీవలే విజయ్‌హజారె ట్రోఫీలో హైదరాబాద్‌ తరఫున సర్వీసెస్‌పై లిస్ట్‌-ఏ అరంగేట్రం చేశాడు.

Also Read: SRH Full Squad: తెలుగు ఆటగాళ్లకు నో ఛాన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే!

ఇప్పటికే ఆంధ్రకు చెందిన షేక్ రషీద్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొనసాగుతున్నాడు. ఇప్పుడు అవనీశ్‌ చెన్నై జట్టులో చోటు దక్కించుకున్నాడు. టీమ్ భవిష్యత్తుకు చెన్నై బాటలు వేస్తున్న విషయం తెలిసిందే. స్టార్ ప్లేయర్స్ ఉన్న చెన్నై తుది జట్టులో మనోడికి అవకాశం వస్తుందో చూడాలి. ఐపీఎల్ 2024 వేలంలో మొత్తం 11 మంది తెలుగు ఆటగాళ్లు బరిలో నిలవగా.. కేఎస్ భరత్‌, అవనీశ్ రావు మాత్రమే అమ్ముడయ్యారు. మిగతా 9 మంది అన్‌సోల్డ్‌గా మిగిలారు.

Show comments