Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద ఫ్యాన్స్ ఆందోళన.. సిబ్బందిపై ఆగ్రహం..
- ఉప్పల్ స్టేడియం వద్ద ఎస్ఆర్హెచ్ అభిమానుల ఆందోళన..
- వాలెట్లను అనుమతించకపోవడంతో ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య మ్యాచ్ మొదలైనప్పటికీ, బయట మాత్రం అభిమానుల ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. స్టేడియం ప్రవేశ ద్వారాల వద్ద పోలీసుల ఆంక్షలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. ముఖ్యంగా క్రికెట్ అభిమానులు తమ వెంట తెచ్చుకున్న వ్యాలెట్లను (Wallets) లోపలికి అనుమతించకపోవడంతో గేట్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది.
అసలు వివాదం ఏమిటి..?
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
సాధారణంగా భద్రతా కారణాల దృష్ట్యా పవర్ బ్యాంకులు, సెల్ఫీ స్టిక్స్, సిగరెట్లు వంటి వస్తువులను నిషేధిస్తారు. అయితే.. ఈసారి పోలీసులు వ్యాలెట్లను కూడా అనుమతించబోమని చెప్పడం అభిమానులను విస్మయానికి గురిచేసింది. నిషేధిత వస్తువుల అధికారిక జాబితాలో వ్యాలెట్ పేరు లేకపోయినా, సిబ్బంది అడ్డుకోవడంతో ఫ్యాన్స్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. డబ్బులు, ఐడెంటిటీ కార్డులు ఉండే వ్యాలెట్లను ఎక్కడ పెట్టాలో తెలియక అభిమానులు గేట్ల వద్దే నిలిచిపోయారు.
అభిమానుల ఇబ్బందులు..
చాలా దూరం నుంచి మ్యాచ్ చూడటానికి వచ్చిన వారు, తమ వద్ద ఉన్న వ్యాలెట్లను భద్రపరుచుకోవడానికి స్టేడియం వద్ద క్లోక్ రూమ్ సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. కొందరు తమ వస్తువులను బయట పడేయలేక, లోపలికి వెళ్లలేక స్టేడియం బయటే ఉండిపోయారు. “టికెట్లు కొని కూడా మ్యాచ్ చూడలేకపోతున్నాం” అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మ్యాచ్ ప్రారంభమైనా ఇంకా చాలా మంది ఫ్యాన్స్ గేట్ల బయటే పోలీసుల తీరుపై నిరసన తెలుపుతున్నారు. ఈ గందరగోళం సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో.. కనీస సమాచారం లేకుండా ఇలాంటి ఆంక్షలు విధించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!