Site icon NTV Telugu

IPL 2026 : క్రికెట్ పండగకు ముహూర్తం ఖరారు.. కానీ చిన్న ట్విస్ట్!

Ipl 2026

Ipl 2026

IPL 2026 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 (IPL 19వ సీజన్) సందడి మొదలైంది. అయితే, షెడ్యూల్ విషయంలో బీసీసీఐ (BCCI) ఒక కీలక మార్పు చేసినట్లు సమాచారం. తొలుత మార్చి 26న ప్రారంభం కావాల్సిన ఈ ధనాధన్ టోర్నీ, ఇప్పుడు రెండు రోజులు ఆలస్యంగా అంటే మార్చి 28 (శనివారం) నుండి ప్రారంభం కానుందని సమాచారం. మే 31న గ్రాండ్ ఫైనల్ జరగనుందని టాక్. ఈ నేపథ్యంలో అసలు ఐపీఎల్ ఎందుకు ఆలస్యమవుతోంది? ఎన్నికల ఎఫెక్ట్ ఏయే జట్లపై పడనుంది? బీసీసీఐ ప్లాన్ ఏంటి? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

READ ALSO: Gold & Silver Prices: యుద్ధం ఎఫెక్ట్.. కొండెక్కిన బంగారం, వెండి ధరలు.. వామ్మో ఒక్కరోజులో ఇంత పెరిగాయేంటి?

త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం తేదీలే కాదు, వేదికల విషయంలో కూడా ఈసారి అనూహ్య మార్పులు ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలి మ్యాచ్ ఆడాల్సి ఉన్నా, చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ నిర్వహణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను బట్టి బీసీసీఐ (BCCI) ఐపీఎల్ పాక్షిక షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో ఐపీఎల్ 2026 గ్రాండ్ ఓపెనింగ్ మార్చి 26 అనుకున్నప్పటికీ, ఇప్పుడు రెండు రోజులు ఆలస్యంగా మార్చి 28న ప్రారంభం కానుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మే 31న జరగనుందని తెలుస్తుంది.

ఆలస్యం ఎందుకు..
తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల తేదీల ప్రకటన కోసం బీసీసీఐ వేచి చూస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆయా తేదీల్లో మ్యాచ్‌లు నిర్వహించడం కష్టం కాబట్టి, ఎన్నికల షెడ్యూల్ వచ్చాకే పూర్తి ఐపీఎల్ షెడ్యూల్ ఖరారవుతుందని సమాచారం. అలాగే మార్చి 8న ముగిసే టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత స్టేడియాలను ఐపీఎల్ కోసం సిద్ధం చేయడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుంది. ఈ ఐపీఎల్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భద్రతా కారణాల దృష్ట్యా ఇంకా అనుమతులు రాలేదు. ఒకవేళ అక్కడ సాధ్యం కాకపోతే, నవీ ముంబై, రాయ్‌పూర్ లేదా పూణేలలో ఏదో ఒక స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి ఈ ఏడాది ఐపీఎల్ అనుకున్న టైంలో రావచ్చని చెబుతున్నారు.

READ ALSO: Pakistan Cricket: పాక్ క్రికెట్ హిస్టరీలో బిగ్గెస్ట్ సర్జరీ.. ఈ స్టార్ల కెరీర్ ఇక ముగిసినట్టేనా?

Exit mobile version