Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్‌ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన కీలక పోరులో ఆర్సీబీ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. గాయపడిన రజత్ పటీదార్ స్థానంలో నాలుగో నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చిన వెంకటేశ్.. కేవలం 40 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ జట్టు స్కోరును 220 మార్కు దాటించడంలో కీలక పాత్ర పోషించాడు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన విజయ్ స్టైల్..
ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ మార్కును అందుకున్న తర్వాత వెంకటేశ్ అయ్యర్ చేసిన సెలబ్రేషన్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. స్టార్ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన బ్లాక్‌బస్టర్ సినిమా ‘మెర్సల్’లో చేసిన ఒక పోజ్‌ను వెంకటేశ్ మైదానంలో రీ-క్రియేట్ చేశాడు. విజయ్ స్టైల్‌ను అనుకరిస్తూ అతను చేసిన ఈ సంబరాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సినిమా, క్రికెట్ అభిమానులు ఈ రెండు చేష్టల మధ్య ఉన్న పోలికలను ఎత్తిచూపుతూ పోస్టులు పెడుతున్నారు.
Also Read
- Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
- Saudi Arabia: మసీదులో ముద్దు పెట్టుకుంటే మరణశిక్షనా.? సౌదీ శిక్షపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం..
- Sharwanand: 'భోగి'తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
- Rajinikanth - Nayanthara: 'ధర్మన్'లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
Seizing the opportunity in style 👌
Updates ▶️ https://t.co/3u5qL0Zn75#TATAIPL | #KhelBindaas | #PBKSvRCB | @venkateshiyer pic.twitter.com/VMHmF39cr5
— IndianPremierLeague (@IPL) May 17, 2026
ఆర్సీబీ భారీ స్కోరు
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి ఓపెనర్ జాకబ్ బెథెల్ త్వరగా అవుట్ అయినా.. విరాట్ కోహ్లీ (37 బంతుల్లో 58), దేవదత్ పడిక్కల్ (25 బంతుల్లో 45) రెండో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యంతో బలమైన పునాది వేశారు. కోహ్లీ తన 67వ ఐపీఎల్ అర్ధసెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్ మధ్య ఓవర్లలో పరుగుల వేగాన్ని అస్సలు తగ్గనివ్వలేదు. లాకీ ఫెర్గూసన్ వేసిన ఓవర్లో లాంగ్-ఆఫ్, లాంగ్-ఆన్ మీదుగా భారీ సిక్సర్లు బాదాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (12 బంతుల్లో 28) కూడా మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ 4 వికెట్లకు 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే పంజాబ్‌కు, ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే ఆర్సీబీకి ఈ మ్యాచ్ విజయం ఎంతో కీలకం.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy : స్థానిక పోరుపై కూటమికి సజ్జల సవాల్
-
Uppal Flyover : 8 ఏళ్లుగా ఎదురుచూపులే.. ఉప్పల్ ఫ్లైఓవర్ ఎప్పటికి పూర్తి.?
-
Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
-
Saudi Arabia: మసీదులో ముద్దు పెట్టుకుంటే మరణశిక్షనా.? సౌదీ శిక్షపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం..
-
Machilipatnam Crime: అనుమానం పెనుభూతమై.. భార్యను గొంతు నులిమి చంపిన భర్త
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!