Site icon NTV Telugu

IPL 2026 Second Phase: ఐపీఎల్ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల.. ఆ లిస్ట్ ఇదే..

Ipl Second Phases

Ipl Second Phases

ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి రెండో దశ (Phase 2) షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా విడుదల చేసింది. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు దేశవ్యాప్తంగా 12 నగరాల్లో మొత్తం 50 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ విడతలో భాగంగా ఎనిమిది రోజుల పాటు ఒక్కో రోజు రెండు మ్యాచ్‌లు (డబుల్ హెడర్స్) నిర్వహిస్తారు. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.

ఈ షెడ్యూల్ ఏప్రిల్ 13న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే పోరుతో మొదలవుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 14న చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఏప్రిల్ 15న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఏప్రిల్ 16న ముంబైలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌తో పోటీ పడుతుంది. ఏప్రిల్ 17న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడతాయి.

Also Read:Gold Robbery: బంగారం కోసం చెవులను కోసేసి.. ఆపై దారుణం..

ఏప్రిల్ 18వ తేదీన రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. మధ్యాహ్నం బెంగళూరులో ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య, రాత్రి హైదరాబాద్‌లో సన్‌రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోటీ జరుగుతుంది. ఏప్రిల్ 19న కూడా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. మధ్యాహ్నం కోల్‌కతాలో కేకేఆర్ , రాజస్థాన్ రాయల్స్ మధ్య.. రాత్రి చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌లు ఉంటాయి.

ఏప్రిల్ 20న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ మరియు ముంబై ఇండియన్స్ తలపడతాయి. ఏప్రిల్ 21న హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు జరుగుతుంది. ఏప్రిల్ 22న లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ పోటీ పడతాయి. ఏప్రిల్ 23న ముంబైలో ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఏప్రిల్ 24న బెంగళూరులో ఆర్సీబీ , గుజరాత్ టైటాన్స్ తలపడతాయి. చివరగా ఏప్రిల్ 25న మధ్యాహ్నం ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

Exit mobile version