Gold Robbery: బంగారం కోసం చెవులను కోసేసి.. ఆపై దారుణం..
- మహిళ దారుణ హత్య..
- బంగారు నగలు కాజేసి.. హత్య చేసిన నిందితుడు..
- శవాన్ని తోటలో పాతిపెట్టిన వైనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కోసం ఓ మహిళ చెవులను కోసేసి.. ఆపై దారుణ హత్య చేశారు. అంతే కాకుండా.. ఆమె శవాన్ని తోటలో పాతి పెట్టారు. గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా జిల్లా ఇంద్రద్ గ్రామంలో ఒక దారుణమైన హత్య వెలుగులోకి వచ్చింది. 54 ఏళ్ల శారదాబెన్ థాకూర్ అనే మహిళ అదృశ్యం కావడం, ఆపై ఆమె శవమై కనిపించడం స్థానికంగా పెను కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు కేవలం 10 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు.
అసలేం జరిగింది?
మార్చి 20వ తేదీన శారదాబెన్ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించగా ఫలితం లేకపోయింది. చివరకు సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, ఆమె ‘సవితా అమృత్ ఫామ్’ అనే తోటలోకి వెళ్లినట్లు కనిపించింది. కానీ.. ఆమె తిరిగి బయటకు వచ్చిన దృశ్యాలు ఎక్కడా లేవు. అనుమానంతో పోలీసులు ఆ తోటను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడ ఒక నిమ్మ చెట్టు కింద మట్టిని కొత్తగా తవ్వినట్లు గుర్తించారు. ఆ మట్టిపై ఈగలు ముసురుతుండటంతో అనుమానం వచ్చి తవ్వగా.. శారదాబెన్ మృతదేహం బయటపడింది.
Also Read
నిందితుడు సచిన్ కుమార్ దంతాని, శారదాబెన్‌ను దారుణంగా హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న నగలను దోచుకున్నాడు. కేవలం బంగారం కోసం ఆమె చెవులను కూడా కోసేసి, సుమారు రూ. 4.40 లక్షల విలువైన ఆభరణాలతో పరారయ్యాడు. మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా తోటలోనే పాతిపెట్టాడు.
నిందితుడు కిలో వెండి పట్టీలను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తనపై ఉన్న అప్పుల భారం వల్లే ఈ హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితుడి నుంచి హత్యకు వాడిన ఆయుధాన్ని, రూ. 3.40 లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు.
తాజావార్తలు
-
Sudivya Kumar Sonu: ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత.. జేఎంఎం తీవ్ర దిగ్భ్రాంతి
-
Maremmma Pre Release Event: అబ్బాయి సినిమా చూసి ఫిదా అయిన రవితేజ.. ‘మారెమ్మ’పై మాస్ మహారాజా ప్రశంసలు
-
Miss World 2026 Winner: జోహెయిర్రీ మోలా సొంతం చేసుకున్న మిస్ వరల్డ్ కిరీటం.. టాప్ 40లో నికితా పొర్వాల్
-
Bigg Boss Telugu 10: ఇక బిగ్ బాస్ సందడే.. ఈరోజు నుంచి షో స్టార్ట్.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే!
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!