Site icon NTV Telugu

Aakash Chopra: “కోట్లు పెట్టి కొంటే హ్యాండ్ ఇస్తారా?”.. ఐపీఎల్‌లో విదేశీ ప్లేయర్స్‌ తీరుపై ఆకాష్ చోప్రా ఫైర్

Akash

Akash

Aakash Chopra: ఐపీఎల్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. అప్పటికే అన్ని జట్లు సిద్ధమయ్యాయి. ఇక ఓ అంశం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన బౌలర్లు ఒక్కొక్కరిగా ఐపీఎల్‌కు దూరమవుతున్నారు. దీంతో కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఫ్రాంచైజీలు ఆందోళనకు గురవుతున్నాయి. సన్‌రైజర్స్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఇప్పటికే దూరమయ్యాడు. ఇషాన్ కిషన్‌ను తమ కెప్టెన్‌గా టీమ్ నియమించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా టోర్నమెంట్ ప్రారంభానికి దూరమవ్వనున్నాడు. ఇప్పుడు, ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన మిచెల్ స్టార్క్ సైతం ఐపీఎల్ 2026 ప్రారంభానికి అందుబాటులో ఉండడు. ఇలా వరుసగా స్టార్ ప్లేయర్స్ దూరమవుతుండంపై తాజాగా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఫైర్ అయ్యారు. మిచెల్‌ స్టార్క్‌ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని తెలిసిందన్నారు. ఇప్పటికే జోష్‌ హాజిల్‌వుడ్‌, పాట్‌ కమిన్స్‌లు దూరమయ్యారని.. తాజాగా స్టార్క్‌ గాయంతో బాధపడుతున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా పేర్కొందన్నారు. కానీ నిజానికి అతను ఫిట్‌గా ఉన్నప్పటికీ సీఏ మాత్రం ఏవో సాకులు చెప్పి అతన్ని ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడకుండా చూస్తుందని ఆరోపించారు. స్టార్క్‌ టీ20 క్రికెట్‌కు ఎప్పుడో వీడ్కోలు పలికాడని గుర్తు చేశారు. మరి రెండు నెలలుగా స్టార్క్‌ విషయంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఏం చేసినట్లు? అని నిలదీశారు.

READ MORE: Danam Nagender : దానం నాగేందర్ ‘క్లీన్ చిట్’పై హైకోర్టులో సవాల్

“ఆస్ట్రేలియా క్రికెట్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. మరోవైపు న్యూజిలాండ్ బౌలర్ లోకీ ఫెర్గూసన్ సైతం దూరమయ్యాడు. ఫెర్గూసన్ కుటుంబంతో గడిపపేందుకు తొలి ఏడు మ్యాచులకు రాకపోవడం దారుణం.. ప్రెసెంట్ అతను సౌతాఫ్రికాతో 20 సిరీస్‌లు అడుతున్నాడు. ఇది అయిపోగానే వెంటనే కుటుంబంతో గడిపేందుకు వెళ్తాడట. అది అతడి వ్యక్తిగతం కానీ.. అతన్ని రూ. 2 కోట్లకు కొనుగోలు చేశారు. ఏడు మ్యాచుల తర్వాత వచ్చి రూ.కోటి తీసుకుని వెళ్లిపోతాడు. ఐపీఎల్‌లో మాట ఇచ్చి ఏడు మ్యాచ్‌లకు దూరమైతే, టీమ్‌లు ఏం చేయాలి? ఇది సరైన నిర్ణయం కాదు.. జట్టు తీవ్రంగా నష్టపోతుంది.” అని ఆకాష్ చోప్రా వెల్లడించారు. ఇదిలా ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌లో పాట్ కమిన్స్ లేని లోటు స్పష్టంగా కనిపించనుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌లో మిచెల్ స్టార్క్ లేని లోటును పూడ్చేందుకు లుంగీ ఎన్గిడి లేదా కైల్ జేమీసన్ వంటి బౌలర్లపై ఆధారపడాల్సి వస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ లో నాథన్ ఎల్లిస్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమవ్వడం సీఎస్‌కేకు పెద్ద దెబ్బగా మారనుంది. లక్నో సూపర్ జెయింట్స్ లో వానిందు హసరంగ సైతం గాయంతో బాధపడుతుండటంతో ఆ జట్టు స్పిన్ విభాగంపై ఆందోళన నెలకొంది. విదేశీ ఆటగాళ్ల ఈ తరహా నిర్ణయాల వల్ల ఐపీఎల్ ఫ్రాంచైజీలు భవిష్యత్తులో ఆటగాళ్లను ఎంచుకునేటప్పుడు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది.

🏷️ SEO Meta Title

Exit mobile version