NTV Telugu Site icon

IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఎప్పటి నుంచి మ్యాచ్‌లు అంటే..?

Ipl 2025

Ipl 2025

క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఓ గుడ్ న్యూస్‌ను బీసీసీఐ చెప్పింది. ఐపీఎల్ (IPL) 2025 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్ ను తాజాగా ప్రకటించింది. మార్చి 21వ తేదీ నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. అలాగే.. మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 23 నుంచి మే 25 వరకు ఐపీఎల్-2025 జరుగుందని తెలిపారు. మొదటి మ్యాచ్‌లో చెన్నై వేదికగా చెన్నై వర్సెస్ ఆర్సీబీ తలపడనున్నాయి. అంతేకాకుండా.. ఐపీఎల్‌కు కొత్త కమిషనర్‌ను ఎన్నుకుంటామని వెల్లడించారు. ఇంతకుముందు ఐపీఎల్ షెడ్యూల్‌ను చివరి నిమిషంలో విడుదల చేసేది. అయితే ఈసారి మాత్రం రెండు నెలల ముందుగానే షెడ్యూల్ ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌తో ఐపీఎల్ షెడ్యూల్ క్లాష్ కాకూడదనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.