Site icon NTV Telugu

Virat Kohli: మూడు ఫైనల్స్‌ ఆడిన ఆర్సీబీ.. విరాట్‌ కోహ్లీ ఎన్ని రన్స్ చేశాడో తెలుసా?

Virat Kohli Rcb

Virat Kohli Rcb

ఐపీఎల్ 2025 ఫైనల్ ఈరోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. మరికొన్ని గంటల్లో పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫైనల్స్‌లో తలపడనున్నాయి. క్వాలిఫయర్‌-1లో పంజాబ్‌పై విజయంతో బెంగళూరు నేరుగా ఫైనల్ చేరుకోగా.. క్వాలిఫయర్‌-2లో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించి పంజాబ్‌ టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఫైనల్స్‌లో ఏ టీమ్ టైటిల్‌ గెలిచినా.. కొత్త ఛాంపియన్‌గా నిలుస్తుంది. అయితే ఆర్సీబీనే కప్ గెలవాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు కారణం ‘కింగ్’ విరాట్ కోహ్లీనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్స్‌కు చేరడం ఇది నాలుగోసారి. 2009, 2011, 2016లో ఫైనల్ చేరిన ఆర్సీబీ.. ఐపీఎల్ 2025లో టైటిల్ పోరుకు సిద్దమైంది. ఫైనల్స్‌లో​ విరాట్‌ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడుతాడని ఫాన్స్ ధీమాగా ఉన్నారు. ఇందుకు కారణం ఈ సీజన్‌లో కోహ్లీ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. కింగ్ 14 మ్యాచ్‌ల్లో 614 రన్స్‌ చేశాడు. ఈ ఏడాది ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసింది అతడే. ఆర్సీబీ నాలుగోసారి ఫైనల్స్‌కు చేరిన నేపథ్యంలో గత మూడు ఫైనల్స్‌లో​ విరాట్‌ ఎలా ఆడాడు, ఎన్ని రన్స్ చేశాడో ఓసారి చూద్దాం.

Also Read: RCB vs PBKS Final: విరాట్ ఇదే అద్భుత అవకాశం.. ఇప్పుడు కాకపోతే..!

2009 సీజన్‌లో ఆర్సీబీ మొదటిసారి ఫైనల్ ఆడింది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 8 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. డెక్కన్‌ ఛార్జర్స్‌ బౌలర్ ఆండ్రూ సైమండ్స్‌ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 2011 ఫైనల్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 32 బంతుల్లో 35 పరుగులు చేశాడు. మిస్టర్ ఐపీఎల్ సురేశ్‌ రైనా బౌలింగ్‌లో విరాట్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 2016 ఫైనల్స్‌లో 35 బంతుల్లో 54 రన్స్ బాదాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్ బరిందర్ స్రాన్ బోల్డ్ చేశాడు. మరి ఐపీఎల్ 2025 ఫైనల్లో కింగ్ ఎన్ని పరుగులు చేస్తాడో చూడాలి.

Exit mobile version