Site icon NTV Telugu

PBKS vs LSG: బౌలింగ్‌ ఎంచుకున్న లక్నో.. ఆకాష్ ఐపీఎల్ అరంగేట్రం!

Pbks Vs Lsg Toss

Pbks Vs Lsg Toss

ఐపీఎల్‌ 2025లో భాగంగా మరికాసేపట్లో పంజాబ్‌ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లక్నో రిషబ్ పంత్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌తో ఆకాష్ మహరాజ్ సింగ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ల‌క్నో త‌ర‌పున అతడు బరిలోకి దిగనున్నాడు. మరోవైపు పంజాబ్ జ‌ట్టులోకి మార్క‌స్ స్టోయినిష్ తిరిగొచ్చాడు.

ఐపీఎల్ 2025లో పంజాబ్‌ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లూ 10 మ్యాచ్‌లు ఆడాయి. పంజాబ్‌ 6 విజయాలు సాధించగా.. లక్నో ఐదు గెలిచింది. ప్లేఆఫ్స్‌ రేసులో ముందంజ వేయాలంటే రెండు జట్లకూ ఈ మ్యాచ్‌లో గెలవడం చాలా కీలకం. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. పంజాబ్ ప్లేయర్స్ ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ ఫామ్‌లో ఉన్నారు. అయితే పేలవ ఫామ్‌ కొనసాగిస్తున్న రిషబ్‌ పంత్‌పై అందరి దృష్టీ నిలిచి ఉంది.

Also Read: Riyan Parag: వరుసగా ఆరు సిక్స్‌లు బాదిన రియాన్ పరాగ్.. వీడియో వైరల్!

తుది జ‌ట్లు:
పంజాబ్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), జోష్ ఇంగ్లిస్ (కీప‌ర్‌), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్.
లక్నో: ఐడెన్ మార్‌క్రమ్‌, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్‌), అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, ఆకాష్ మహరాజ్ సింగ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్.

Exit mobile version