Ambati Rayudu will doing commentary in IPL 2024 for Star Sports Telugu: గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్‌సోల్డ్‌గా మిగిలిన విషయం తెలిసిందే. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన స్మిత్‌ను కొనేందుకు ఏ ప్రాంచైజీ ఆసక్తి చూపలేదు. అయితే వేలంలో అన్‌సోల్డ్‌గా ఉన్న స్మిత్.. ఐపీఎల్ 2024లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సీజన్‌లో అతడు బ్యాటర్‌గా బరిలోకి దిగడం లేదు.. కామెంటెటర్‌గా వ్యవహరించనున్నాడు.
ఇంగ్లీష్ కవరేజ్ కోసం వ్యాఖ్యాతల జాబితాను స్టార్ స్పోర్ట్స్ ఈరోజు ప్రకటించింది. ఇందులో స్టీవ్ స్మిత్ పేరు కూడా ఉంది. స్టీవ్ సహా ఎందరో మాజీలు కామెంటెటర్‌గా వ్యవహరించనున్నారు. స్మిత్, బ్రాడ్, స్టెయిన్, కల్లిస్, మూడీ, కాలింగ్‌వుడ్, గవాస్కర్, లారా, రవిశాస్త్రి, హేడెన్, పీటర్సన్, క్లార్క్, మంజ్రేకర్, ఫించ్, బిషప్, నైట్, కటిచ్, మారిసన్, మోరిస్, బద్రీ, కేటీ, స్వాన్, దీప్ దాస్‌గుప్తా, భోవాగ్వాలే , అంజుమ్, మురళీ కార్తీక్, రామన్, రోహన్, గంగా, హోవార్డ్, జెర్మనోస్‌లు ఇంగ్లీష్ వ్యాఖ్యానం చేయనున్నారు.
Also Read: IPL 2024-BCCI: భారత అభిమానులకు షాక్.. యూఏఈలో ఐపీఎల్ 2024!
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా కామెంటెటర్‌గా వ్యవహరించనున్నాడు. తెలుగు కోసం రాయుడు వ్యాఖ్యానం చేయనున్నాడు. రాయుడు గతేది ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మిథాలీ రాజ్, ఎంఎస్కే ప్రసాద్, వేణుగోపాల్ రావు కూడా తెలుగు కామెంటరీ చేయనున్నారు. పలు భాషల కోసం మాజీలు వ్యాఖ్యానం చేయనున్నారు. ఇందుకు సంబందించిన జాబితాను స్టార్ స్పోర్ట్స్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఐపీఎల్ 2024 మార్చి 22 నుంచి ఆరంభం అవుతున్న విషయం తెలిసిందే.