NTV Telugu Site icon

IPL 2024: అప్పుడు క్రికెట్‌ కిట్‌ కొనే పరిస్థితి కూడా లేదు.. ఇప్పుడు ఇళ్లు కొంటా: దూబె

Shubham Dubey

Shubham Dubey

Shubham Dubey wanted to buy a house for his family: ఒకప్పుడు తమ కుటుంబానికి కనీసం క్రికెట్‌ కిట్‌ కొనిచ్చే పరిస్థితి ఉండేది కాదని యువ బ్యాటర్‌ శుభమ్‌ దూబె తెలిపాడు. ఐపీఎల్‌ 2024 ద్వారా వచ్చే డబ్బుతో తన కుటుంబం కోసం ఇళ్లు కొంటానని చెప్పాడు. కోచ్‌ కుమార సంగక్కరను కలుసుకోవాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు శుభమ్‌ పేర్కొన్నాడు. విదర్భకు చెందిన శుభమ్‌ దూబెని ఐపీఎల్ 2024 మినీ వేలంలో రాజస్థాన్‌ రాయల్స్‌ రూ. 5.60 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

‘ఒకప్పుడు మా కుటుంబానికి కనీసం క్రికెట్‌ కిట్‌ కొనిచ్చే పరిస్థితి లేదు. కానీ నాన్న కష్టపడి కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. వాళ్లు ఎప్పుడూ నాపై ఒత్తిడి తీసుకురాలేదు. క్రికెట్ ఆడొద్దని చెప్పలేదు. నాకు అండగా నిలిచారు. పాన్‌షాప్‌ నడుపుతూ నాన్న చాలా కష్టపడ్డారు. ఆ తర్వాత హోటల్‌లో మేనేజర్‌గా ఎదిగారు. ఇప్పుడు వాళ్లకు నేను సంతోషం కలిగించాలి. ఇందుకోసం మొదట ఒక ఇళ్లు కొంటున్నా’ అని శుభమ్‌ దూబె తెలిపాడు.

Also Read: Praja Palana Applications 2023: నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన అప్లికేషన్లు ప్రారంభం

రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ప్రధాన కోచ్‌ కుమార సంగక్కరను కలుసుకోవాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు శుభమ్‌ దూబె చెప్పాడు. సంగక్కర సార్‌ కెరీర్‌ను రిటైర్‌ అయ్యేదాకా అనుసరించానని, ఆయన అపార అనుభవజ్ఞుడని పేర్కొన్నాడు. సంగా సార్ నుంచి ఎంతో నేర్చుకోవాలనుకుంటున్నా, ఐపీఎల్ 2024 ఆడేందుకు ఎదుర్కస్తున్నా’ అని శుభమ్‌ చెప్పుకొచ్చాడు.

Show comments