Site icon NTV Telugu

Mumbai Indians: ఆ వార్తలు అవాస్తవం.. ఏ ఆటగాడు ముంబై ఇండియన్స్‌ను వీడటం లేదు!

Mumbai Indians

Mumbai Indians

Mumbai Indians on Suryakumar, Bumrah leaving MI: రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ముంబై ఇండియన్స్‌పై ఫాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. హార్దిక్‌ పాండ్యాను కెప్టెన్‌ చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ముంబై జట్టును అన్‌ఫాలో అవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రోహిత్ కెప్టెన్సీ మార్పుపై జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ అసంతృప్తిగా ఉన్నారని.. వారు కూడా ముంబై జట్టును వీడుతారనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. అంతేకాదు హార్దిక్‌ నాయకత్వంలో తాము ఆడమని చెప్పినట్లూ కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్ స్పందించింది. నెట్టింట వస్తున్న వార్తలు అవాస్తవం అని స్పష్టం చేసింది.

Also Read: Royal Enfield Bike : ఇదేం పిచ్చిరా బాబు..బుల్లెట్ బైక్ గుడి కట్టించ, రోజూ పూజలు కూడా.. ప్రత్యేకతలు..

‘ఇలాంటి ప్రచారం ఎలా మొదలవుతుందో అర్థం కావడం లేదు. సోషల్ మీడియా ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఏ ప్లేయర్ కూడా ముంబైని వీడటం లేదు. మేం ఏ ఆటాడిని కొనుగోలు చేయడం లేదు. కెప్టెన్సీ మార్పుపై రోహిత్‌ శర్మకు ముందే తెలుసు. అతడితో మాట్లాడాకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ముంబై ఇండియన్స్‌ స్పష్టం చేసింది. మరోవైపు మినీ వేలం సందర్భంగా దుబాయ్‌లో ముంబై యజమాని ఆకాశ్‌ అంబానీ కూడా రోహిత్ గురించి స్పందించాడు. ‘రోహిత్ శర్మ విషయంలో ఆందోళన వద్దు. అతడు బ్యాటింగ్‌ చేస్తాడు’ అని అభిమానులతో అన్నాడు. రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్ చేయండి అన్న నినాదాలకు అంబానీ రిప్లై ఇచ్చాడు.

Exit mobile version