NTV Telugu Site icon

IPL 2024 Auction: ఐపీఎల్‌ 2024 వేలం డేట్, టైమ్, లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Mallika Sagar Ipl Auction 2024 Auctioneer

Mallika Sagar Ipl Auction 2024 Auctioneer

Full Details of IPL 2024 Auction: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్) 2024 వేలం కోసం సర్వం సిద్ధమైంది. ఈ వేలంలో 12 దేశాల నుంచి మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. 333 మందిలో 119 మంది విదేశీయులున్నారు. 10 ఫ్రాంచైజీలలో 77 స్లాట్‌లు మాత్రమే ఖాళీగా ఉండగా.. అందులో విదేశీ ఆటగాళ్ల స్లాట్‌లు 30. ఈ మినీ వేలంలో 214 మంది ఇండియన్ ప్లేయర్స్ ఉండగా.. 119 మంది విదేశీయులు, ఇద్దరు అసోసియేట్‌ దేశాల నుంచి ఉన్నారు. 333 మంది ఆటగాళ్లలో కొందరు స్టార్ ఆటగాళ్లపై కాసుల వర్షం కురవనుంది. ఐపీఎల్ 2024 వేలం మరికొన్ని గంటల్లో ఆరంభం కానున్న నేపథ్యంలో డేట్, టైమ్, లైవ్‌ స్ట్రీమింగ్‌ లాంటి వివరాలను ఓసారి చూద్దాం.

IPL Auction 2024 Date and Time:
ఐపీఎల్ 2024 మినీ వేలం డిసెంబర్ 19న జరగనుంది. దుబాయ్‌లోని కోకా-కోలా ఏరేనా హోటల్‌లో ఈ వేలం జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు వేలం ఆరంభం అవుతుంది. ఇది మినీ వేలం కాబట్టి ఒకే రోజులో ముగుస్తుంది. భారత్ అవతల జరుగుతున్న తొలి వేలం ఇదే కావడం విశేషం. ఇది 17వ ఐపీఎల్‌ వేలం. గతేడాది కూడా డిసెంబర్‌లోనే వేలం జరిగింది.

IPL Auction 2024 Live Streaming:
ఐపీఎల్ 2024 వేలంను నిర్వాహకులు స్టార్ స్పోర్ట్స్, జియా సినిమాలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మొబైల్ లేదా టీవీలో ఈ వేలాన్ని ఉచితంగా చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్, జియా సినిమాలో భారత్‌లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. మిగతా దేశాల్లో వేరే బ్రాడ్ కాస్టర్‌లు వేలంను స్ట్రీమింగ్ చేస్తాయి.

IPL Auction 2024 Purse Value:
ఐపీఎల్‌ 2024 వేలంలో ఖర్చు పెట్టడానికి 10 ఫ్రాంఛైజీల వద్ద రూ. 262.95 కోట్లు ఉండగా.. అత్యధికంగా గుజరాత్‌ టైటాన్స్‌ వద్ద రూ. 38.15 కోట్లు ఉన్నాయి. అత్యల్పంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ వద్ద రూ. 13.15 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఇక తెలుగు జట్టు సన్‌రైజర్స్‌ వద్ద రూ.34 కోట్లు ఉన్నాయి.

Also Read: Mumbai Indians: హార్దిక్‌ పాండ్యా పరిపూర్ణమైన కెప్టెన్‌ కాదు.. రోహిత్ శర్మకు ముందే తెలిసి ఉంటుంది!

IPL Auction 2024 Youngest Player:
దక్షిణాఫ్రికాకు చెందిన 17 ఏళ్ల క్వేనా మఫాకా ఐపీఎల్‌ 2024 వేలంలో పిన్న వయస్కుడు. అఫ్గాన్‌కు చెందిన మహమ్మద్‌ నబీ (38) అత్యధిక వయస్కుడు. ఈ వేలంలో ట్రావిస్‌ హెడ్, రచిన్‌ రవీంద్ర, మిచెల్ స్టార్క్‌, పాట్ కమిన్స్, కొయిట్జీలకు అత్యధిక ధర పలికే అవకాశం ఉంది.

IPL Auction 2024 Auctioneer:
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 వేలం నిర్వహించిన మల్లికా సాగర్‌.. ఐపీఎల్‌ 2024 వేలంను కూడా నిర్వహించనున్నారు. మల్లికా ముంబైకి చెందిన ఓ ఆర్ట్‌ కలెక్టర్‌. 48 ఏళ్ల మల్లికాకు వేలంలో 25 సంవత్సరాల అనుభవం ఉంది. 2021లో ప్రొ కబడ్డీ లీగ్‌ వేలంలో మల్లికా తన వాక్‌ చాతుర్యంతో అకట్టుకున్నారు.

Show comments