NTV Telugu Site icon

IPL2023 : సన్‌రైజర్స్ బ్యాటింగ్‌పై పేలుతున్న మీమ్స్

Srh Memrs

Srh Memrs

ఐపీఎల్ 2023 సీజన్ 16లో టైటిల్ ఫెవరెట్ టీమ్స్ లో ఒకటిగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉంది. అయితే రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చిత్తుగా ఓడిన ఆరెంజ్ ఆర్మీ జట్టు.. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లోను అదే విదమైన వైఫల్యాలను ముట్టగట్టుకుంది. అయితే సన్ రైజర్స్ జట్టు రెగ్యూలర్ కెప్టెన్ వచ్చిన ఆ జట్టు తలరాత మాత్రం మారలేదు. ఫస్ట్ మ్యాచ్ లో వైస్ కెప్టెన్ గా ఉన్న భువనేశ్వర్ కుమార్ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్సీ లోపాలతో మ్యాచ్ ఓటమికి కారణంగా కాగా.. రెండో మ్యాచ్ లో లక్నో తో జరిగిన మ్యా్చ్ లో అయిడిన్ మార్క్రమ్ డకౌట్ అయ్యాడు. అతడు మార్క్ వుడ్ బౌలింగ్ లోనో లేదా అద్భుతమైన స్పిన్నర్ బౌలింగ్ లో ఔట్ అయితే పెద్దగా బాధపడేవాళ్లు కాదు.. కాని స్పిన్ అని చెప్పి.. విసిరి వేసినట్లుగా బౌలింగ్ చేసే కృనాల్ పాండ్యా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Also Read : Doctors Negligence: డాక్టర్ల నిర్లక్ష్యం.. కట్టుకట్టి బ్లేడ్ మరిచిపోయారు

అయితే సన్ రైజర్స్ కెప్టెన్ అయిడిన్ మార్క్రమ్ గోల్డెన్ డకౌట్ తో పాటు రూ. 13.25 కోట్లు పెట్టి కొన్ని హ్యారీ బ్రూక్, రూ. 8.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మాయాంక్ అగర్వాల్ కూడా వరుసగా రెండో మ్యాచ్ లో కూడా ఫెయిల్ అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ఎస్ ఆర్ హెచ్ బ్యాటింగ్ పై మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మొదటి మ్యాచ్ లో ఓడిన తర్వాత మార్క్రమ్ మామ వస్తాడు.. మ్యాచ్ లు గెలిపిస్తాడు అని ఎలివేషన్స్ ఇచ్చాయి చాలా సోషల్ మీడియా పేజీలు. అయితే రెండో మ్యాచ్ లో మలక్ పేట మార్క్రమ్ మామ ముంచేశాడు. దీనిపై ఇన్ స్టాలో జోక్స్ పేలుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో ఎస్ ఆర్ హచ్ బ్యాటింగ్ పై మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read : Japanese Military Helicopter: కుప్పకూలిన జపాన్ ఆర్మీ హెలికాప్టర్.. 10 మంది గల్లంతు

సోషల్ మీడియాలో నెటిజన్స్ చెస్తున్నా కొన్ని మీమ్స్ డైలాగ్స్ మీకోసం.. మాస్ మహారాజ్ మలక్ పేట్ మార్క్రమ్ వచ్చిండు అంటిరి కదరా.. ఏమయో.. రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదు రా.. గుండెళ్లో ఒకటే మంటగా ఉంది.. వాషింగ్ టెస్ట్ సుందర్.. మాయంక్ అగర్వాల్ ఫెయిల్ టూడే 8.25 బొక్క.. హ్యారీ బ్రూక్ కు 13 కోట్లు ఇస్తే పెద్ద బొక్క.. అరే బ్రూక్ రూ. 13.25 కోట్ల నుంచి రూ. 25 పెట్టుకుని మిగితావి తిరిగి ఇచ్చేయ్.. అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ గా మారాయి.

Show comments