NTV Telugu Site icon

iPhone 15 Loot: ఐఫోన్ 15 ధరలో భారీ డ్రాప్.. ఏకంగా 39,150 తగ్గింపు.. !

Iphone 15 Pro Max

Iphone 15 Pro Max

iPhone 15 Discount: ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దసరా సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో గృహోపకరణాలు, దుస్తులతో పాటు స్మార్ట్‌ఫోన్‌లను కూడా అతి తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఖరీదైన ఫోన్లకు బడ్జెట్ లో ఎన్నో అద్భుతమైన ఆఫర్లు కూడా ఇస్తున్నారు. మీరు కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ముఖ్యంగా iPhone 15ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, Flipkart దసరా సేల్‌లో మీరు ఫోన్‌పై అనేక ఆఫర్‌లను పొందుతారు. ఐఫోన్ 15 కోసం ఎన్నో బ్యాంక్ ఆఫర్లు ఇవ్వబడుతున్నాయి, వాటి వలన 10 శాతం తగ్గింపు లభిస్తుంది. అదే సమయంలో, పాత ఫోన్ నుండి కొత్త ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవుతూ ఎక్స్ఛేంజ్ చేస్తున్నట్టు అయితే ఆ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇవ్వబడుతుంది. iPhone 15 ఫోన్‌ కోసం అందుబాటులో ఉన్న ఆఫర్‌ల గురించి మీకు తెలిపేందుకే ఈ ఆర్టికల్. ఈ ఫోన్ యొక్క 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,900. దీనితో పాటు, ప్రతి నెల రూ. 2,810 చెల్లించి కొనుగోలు చేసే EMI ఆప్షన్ కూడా ఇవ్వబడుతోంది. మీరు మార్చాలి అనుకుంటున్న పాత ఫోన్ మీ వద్ద ఉంటే, అలా చేయడం ద్వారా మీకు భారీ తగ్గింపు కూడా లభిస్తుంది. పాత ఫోన్‌ని ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.39,150 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక బ్యాంక్ ఆఫర్ల గురించి చెప్పాలంటే Kotak, RBL, SBI క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 10 శాతం తగ్గింపు ఇవ్వబడుతుంది.

iPhone 15 ఫీచర్లు: ఈ ఫోన్‌ను 128 GB, 256 GB – 512 GB స్టోరేజ్ వేరియంట్‌లతో సహా మూడు వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. నలుపు, నీలం, ఆకుపచ్చ, పసుపు, గులాబీ రంగులలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంది. డ్యూయల్ రేర్ కెమెరా కూడా ఉంది, మొదటి సెన్సార్ 48 మెగాపిక్సెల్స్, రెండవది 12 మెగాపిక్సెల్స్. ఫోన్‌లో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. అలాగే ఈ ఫోన్‌లో A16 బయోనిక్ చిప్‌సెట్ అమర్చబడింది.