Site icon NTV Telugu

IOCL Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..490 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..

Job Vacancy

Job Vacancy

కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను నిరుద్యోగులకు చెబుతుంది.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 490 ఖాళీల ను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో అప్రంటీస్, అకౌంట్స్, ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.. ఇక ఉద్యోగాలకు సంబంందించిన పూర్తి వివరాలు..

అప్రెంటీస్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజియన్లలో ఖాళీలు ఉన్నాయి…

ట్రేడ్ అప్రెంటీస్ 150
టెక్నీషియన్ అప్రెంటీస్ 110
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ 230

అర్హతలు :

ట్రేడ్ అప్రెంటీస్- 10వ తరగతి

టెక్నీషియన్ అప్రెంటీస్ – డిప్లొమా

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ – డిగ్రీ, BBA, BA, B.Com, B.Sc. చదివి ఉండాలి..

వయస్సు :

ఈ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థుల వయస్సు ఆగస్టు 31, 2023 నాటికి కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 24 సంవత్సరాలు మించకూడదు.. ఇకపోతే ఈ ఉద్యోగాల కు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు..

దరఖాస్తు ప్రారంభ తేదీ: 25/08/2023

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 10, 2023

అభ్యర్థులు ఈ లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలంటే?

*. ట్రేడ్ అప్రంటీస్ (Trade Apprentice) – ఐటీఐ http://apprenticeshipindia.org/candidate-registration

*. టెక్నీషియన్ అప్రంటీస్ (Technician Apprentice)
*. డిప్లొమా (Diploma) https://www.mhrdnats.gov.in/boat/commonRedirect/registermenunew!registermenunew.యాక్షన్

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనేవాళ్ళు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోవచ్చు..

Exit mobile version