Site icon NTV Telugu

Anantapur: ప్రేమ వ్యవహారమే యువతీ దారుణ హత్యకు కారణమా..?!

Anantapur

Anantapur

Anantapur: ఆదివారం నాడు అనంతపురంలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తన్మయను గుర్తు తెలియని దుండగులు అమానుషంగా హత్య చేసిన ఉదంతం గురించి తెలిసిందే. మణిపాల్ స్కూల్ వెనుక భాగంలో విద్యార్థిని పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఈ పాశవిక చర్య అక్కడి స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. తన్మయ కనిపించడంలేదని ఆమె తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు స్పందించలేదని విద్యార్థినీ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: French Open 2025 Winner: మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా అల్కరాజ్..!

ఇక విద్యార్థిని మృతదేహానికి ఆదివారం రాత్రి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తర్వాత రాత్రివేలే కుటుంబ సభ్యులు మృతురాలి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో నరేష్ అనే యువకుడిపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నరేష్ బేల్దారు పనులు చేస్తూ జీవిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అతనికి నెలరోజుల క్రితం నుంచి తన్మయతో పరిచయం ఏర్పడినట్లు సమాచారం.

Read Also: Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రాకు బెయిల్..? నేడు కోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది..!

పెళ్లి చేసుకోవాలని మృతురాలు ఒత్తిడి చేయడంతోనే నరేష్‌ ఆవేశానికి లోనై అమ్మాయిని హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తన్మయతో జరిగిన గొడవ అనంతరం, నరేష్ ఆమెపై బీర్ బాటిల్‌తో దాడి చేసి అనంతరం పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలను ఇవాళ లేదా అతి త్వరలో మీడియాకు వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Exit mobile version