NTV Telugu Site icon

Bear and Tiger Viral Video: పులిని ఫాలో అయిన ఎలుగుబంటి.. అది తిరిగి చూసే సరికి ఏం చేసిందంటే?

Puli

Puli

Bear and Tiger Viral Video: ఈ మధ్య వైరల్ అవుతున్న వీడియోలు చూస్తుంటే అసలు ఇలాంటివి కూడా జరుతాయా అని ఆశ్చర్యం కలుగుతుంది. క్రూర జంతువులు సైతం తమ నైజానికి విరుద్దంగా ప్రవర్తిస్తున్నాయి. సింహంతో యువతి ఆడుకోవడం, రెండు సింహాల మధ్య ఓ వ్యక్తి కూర్చొని వాటినే చెప్పుతో కొట్టడం, ఈ మధ్య చిరుతతో తాబేలు ఫుడ్ షేర్ చేసుకోవడం లాంటి వీడియోలు వైరల్ అయ్యాయి. ఇవి మాత్రమేనా క్రూరజంతువైన సింహం చెట్టు కొమ్మలను లాక్కోని మరీ ఆకులను తినడం లాంటి వింతలు కూడా చూశాం. ఇక తాజాగా అలాంటిదే నమ్మలేని ఓ వీడియో వైరల్ అవుతుంది.

Also Read: Periods: మందులతో పీరియడ్స్ ను వాయిదా వేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

పులులు జంతువులను వేటాడే తీరు అద్భుతంగా ఉంటుంది. దాని కంటికి ఏదైనా జంతువు కనిపిస్తే చాలు వెంటనే వేటాడి చంపి తింటుంది. అలాంటి పులిని ఓ ఎలుగుబంటి దాని వెనకాలే వెళుతూ ఫాలో అయ్యింది. సాధారణంగా పులిని చూస్తేనే మిగతా జంతువులు కనిపించకుండా పోతాయి. అలాంటిది ఎలుగుబంటి దాని వెనుకే వెళ్లింది. అయితే కొంత దూరం వెళ్లాక పులి వెనక్కి తిరిగి చూసింది. ఇక్కడే ఓ ఫన్నీ సంఘటన జరిగింది. పులి వెనక్కు తిరిగి చూడగానే వెంటనే ఎలుగుబంటి దాని రెండు కాళ్లు పైకి ఎత్తి దాన్ని క్షమించాలి అన్నట్టు వేడుకుంది. అయితే పులి దానిని చూసి ఏం చేయకుండా కింద కూర్చొని తోక ఊపింది. సాధారణంగా జంతువులు తాము ఫ్రెండ్స్ అనుకున్నప్పుడు మాత్రమే తోక ఊపుతాయి. అంటే ఎలుగుబంటిని పులి స్నేహితుడిగా భావిస్తూ ఉండవచ్చు. ఇలాంటి క్యాప్షన్ తోనే ఈ వీడియోను పోస్ట్ చేశారు కూడా. ఇక కొద్ది సేపు అక్కడ ఉన్న ఎలుగుబంటి పులికి కోపం రాక ముందే తప్పించుకోవాలనుకుందో ఏంటో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

 

 

Show comments