కుందనపు బొమ్మ అంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జెస్సీ అలియాస్ సమంత అప్పుడే 15 ఏళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఒడిదుకులు చూసిన సామ్ మళ్లీ మునుపటి ఫామ్ కోసం గట్టిగానే ట్రై చేస్తోంది. విజయ్ దేవరకొండతో చేసిన ఖుషీ తర్వాత వెండితెరపై కనిపించలేదు. తెలుగు ఆడియన్స్‌ను పలకరించలేదు. రీసెంట్లీ టాలీవుడ్‌లోకి తిరిగి వచ్చేయాలంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేయడంతో. తిరిగి వచ్చేస్తున్నా బ్రో అంటూ సమంత చేసిన ఒక్క కామెంట్‌తో టాలీవుడ్ సినీ సర్కిల్క్ లో పెద్ద చర్చే నడుస్తుంది.
Also Read : Exclusive : మరక తొలగించుకునే ప్రయత్నంలో విజయ్ దేవరకొండ
ఇక టాలీవుడ్ కంబ్యాక్ పై వార్తలు పుట్టుకొస్తున్నాయి. ముందుగా నందిని రెడ్డితో సినిమా అనే రూమర్ స్టార్ట్ అయింది. ఈ సారి మంచి గాసిప్స్ సృష్టించండి అంటూ కౌంటర్స్ వేసింది బేబీ డైరెక్టర్ నందూ. ఇక లేటెస్ట్ గా రామ్ చరణ్-సుకుమార్ దర్శకత్వంలో రాబోయే సినిమాలో సామ్ నటించబోతుందంటూ ఓ బజ్ సినీ సర్కిల్క్ లో చక్కర్లు కొడుతుంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన రంగస్థలం కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచింది.ప్రజెంట్ చెర్రీ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఆర్సీ 16 చేస్తున్నాడు. ఇది కంప్లీట్ కాగానే సుక్కు డైరెక్షన్ లో ఆర్సీ 17 సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్టులో సమంత ఫీమేల్ లీడ్‌గా సెలక్టయ్యిందని న్యూస్ సర్య్కులేట్ అవుతోంది. ఇదిలా ఉండగా గత ఏడాది సొంత నిర్మాణ సంస్థను స్థాపించిన సమంత. మా ఇంటి బంగారం అనే మూవీని ప్రకటించింది. ఈ సినిమా ఎంత వరకు వచ్చిందో అప్డేట్ లేదు. తెలుగులో రీ ఎంట్రీ ఇస్తానని కన్ఫప్ చేసిన సమంత ఎనౌన్స్ మెంట్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కోసం ఎప్పుడు తీపి కబురుచెబుతుందో చూద్దాం
