NTV Telugu Site icon

Inter Syllabus : ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ మార్పులు.. కొత్త విధానానికి రంగం సిద్ధం

Inter

Inter

Inter Syllabus : 2025-26 విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు పెద్ద మార్పులు ఎదురవుతున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ ను పూర్తి స్థాయిలో పునరుద్ధరించిన
తెలంగాణ ఇంటర్ బోర్డు, కొత్త విధానాన్ని అమలుకు సిద్ధమవుతోంది. అధికారికంగా సిలబస్ ను ఫైనల్ చేసిన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, ఇది వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.

ఈ మార్పులు కేవలం సిలబస్ పరిమితిలోనే కాకుండా, పరీక్షా విధానంలోనూ ప్రతిఫలించనున్నాయి. ఇప్పటివరకు పూర్తిగా ఎక్సటర్నల్ పరీక్షల ఆధారంగా జరిగే ఇంటర్ పరీక్షలు ఇక 80 మార్క్స్ ఎక్సటర్నల్, 20 మార్క్స్ ఇంటర్నల్ పద్ధతిలో జరగనున్నాయి. ఇది ముఖ్యంగా ఆర్ట్స్ కోర్సులు, లాంగ్వేజ్ సబ్జెక్టులకు వర్తించనుంది. ఈ నిర్ణయంతో విద్యార్థుల నిర్ధారిత మార్కుల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

ఇంటర్నల్ పరీక్షల పరిచయం విద్యా నాణ్యతకు తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నప్పటికీ, ఇది పలువురిలో చర్చనీయాంశంగా మారింది. ఒక వైపు పదో తరగతిలో ఇంటర్నల్స్ ను తొలగించిన ప్రభుత్వం, ఇప్పుడు ఇంటర్ స్థాయిలో మళ్లీ వాటిని ప్రవేశపెట్టడం పట్ల జూనియర్ లెక్చరర్లు ప్రశ్నలు వేస్తున్నారు. విద్యా విధానంలో స్పష్టత ఉండాలని, తరచూ మార్పులు విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తాయని వారు వాదిస్తున్నారు.

ఇక కార్పొరేట్ కళాశాలల విషయానికి వస్తే, ఈ మార్పు వారికి అనుకూలంగా మారవచ్చని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నల్ మార్కుల ప్రభావంతో ర్యాంకులు, గ్రేడ్‌లు నిర్ణయించబడే అవకాశం ఉండటంతో, కార్పొరేట్ కాలేజీల్లో మార్కుల వేట మొదలయ్యే ప్రమాదం ఉందని కొందరు అధ్యాపకులు హెచ్చరిస్తున్నారు.

ఇంతవరకు ప్రభుత్వం ఇంకా తుది ఆమోదం ఇవ్వనప్పటికీ, ఇంటర్ బోర్డు నుండి ఇప్పటికే ప్రతిపాదనలు అందినట్లు సమాచారం. మార్పులకు ముందు, విద్యార్థులు, అధ్యాపకులు, మరియు తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని పలువురు విద్యావేత్తలు సూచిస్తున్నారు. మొత్తానికి, 2025-26 సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు కొత్త సవాళ్లు, కొత్త మార్గదర్శకాలు ఎదురవనున్నాయి. ఈ మార్పులు విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా తీసుకున్నవే అయితేనూ, వాటిని సమర్థవంతంగా అమలు చేయడం పెద్ద పని కానుంది.

Off The Record : నెల్లూరు టీడీపీలో పాత YCP నేతలదే పెత్తనమా? తమ్ముళ్ల అసహనం కట్టలు తెంచుకుంటోందా?