NTV Telugu Site icon

Intelligence Bureau Recruitment : ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. 677 పోస్టుల భర్తీ..

Jobs

Jobs

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. వరుసగా ప్రముఖ సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది.. ఇటీవల పోలీస్ శాఖలో పోస్టులను విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 677 ఖాళీల ను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు..

సెక్యూరిటీ అసిస్టెంట్,మోటార్ ట్రాన్స్ పోర్టు 362 ఖాళీలు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 315 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల కు సంబంధించి గుర్తింపు పొందిన విద్యాసంస్ధ నుండి 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, దృవ పత్రాల పరిశీలిన , మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధుల వయసు 18 నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి..

ఇంటర్వ్యూ లో ఎంపికైన వారికి వేతనం విషయానికి వస్తే సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్ పోర్టు పోస్టుకు నెలకు రూ. 21,700 నుండి రూ. 69100 చెల్లిస్తారు. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అభ్యర్ధులకు నెలకు వేతనంగా రూ 18000 నుండి రూ.56900 వరకు చెల్లిస్తారు.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు చివరి తేదీ నవంబర్ 10.. ఈ ఉద్యోగాల గురించి మరింత వివరాలు తెలుసుకోవాలంటే అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు..