Site icon NTV Telugu

Intelligence Alert: దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులలో హై అలర్ట్.. భద్రతకు ముప్పు!

Indian Airports

Indian Airports

Intelligence Alert: భారతదేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులు, ఎయిర్‌స్ట్రిప్‌లు, హెలిప్యాడ్‌లు, ఫ్లయింగ్ స్కూల్‌లు ఇంకా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్లపై సెక్యూరిటీ అలర్ట్ జారీ అయ్యింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS)కు ఇటీవల కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుండి వచ్చిన కీలక సమాచారం నేపథ్యంలో ఈ హెచ్చరికను జారీ చేసింది. సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2 మధ్య కాలంలో ఉగ్రవాదులు నుంచి ముప్పు ఉండే అవకాశమున్నట్లు హెచ్చరించింది. ఆగస్టు 4న బీసీఏఎస్ జారీ చేసిన అడ్వైజరీ ప్రకారం, అన్ని విమానాశ్రయ కేంద్రాల్లో భద్రతను తక్షణమే బలపర్చాలని సూచించబడింది. టెర్మినల్‌లు, పార్కింగ్ ఏరియాలు, బౌండరీలు, సిటీ సైడ్ ప్రాంతాల్లో సెక్యూరిటీ పెట్రోలింగ్ నిరంతరం కొనసాగించాలని ఆదేశించింది.

Spirit vs Invincibles: క్రికెట్ గ్రౌండ్లో ప్రత్యక్షమైన నక్క.. రచ్చ రచ్చ చేసిందింగా! వైరల్ వీడియో

ఇక ఎయిర్‌పోర్టులలో ప్రతి ఉద్యోగి, కాంట్రాక్టర్, సందర్శకుడి ఐడీని ఖచ్చితంగా పరిశీలించాలని, సీసీటీవీ వ్యవస్థలు పూర్తిగా పనిచేసేలా చూసుకోవాలని.. అలాగే సిటీ సైడ్ భద్రతను లోకల్ పోలీసులతో కలిపి పటిష్టంగా నిర్వహించాలని కేంద్ర ఇంటెలిజెన్స్ పేర్కొంది. ముఖ్యంగా అంతర్జాతీయ, దేశీయ విమానాలన్నింటికీ బీసీఏఎస్ ఆదేశాలు వర్తిస్తాయి. ప్రతి కార్గో, మెయిల్, పార్సెల్‌ను ఎంబార్క్‌మెంట్‌కు ముందు కఠినంగా స్క్రీన్ చేయాలి. ఈ ముప్పు నేపధ్యంలో ప్రమాదకర వస్తువుల విషయమై కఠిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ హెచ్చరిక ఒక ప్రత్యేక ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ ఆధారంగా వెలువడింది.

iPhone 17: ఐఫోన్ లవర్స్ డబ్బులు రెడీ చేసేసుకోండి.. అతి త్వరలో iPhone 17 విడుదల.. ధర, ఫీచర్స్ ఇలా!

Exit mobile version