NTV Telugu Site icon

Instagram: యూజర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఆ ఫీచర్‌కు ఇన్‌స్టాగ్రామ్ గుడ్‌బై!

12

12

ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ తరచూ సరికొత్త అప్‌డేట్స్‌తో వినియోగదారుల్ని ఆకర్షిస్తూ వస్తోంది. యూజర్ల సౌకర్యమే ప్రథమ లక్ష్యంగా ఎన్నో ఫీచర్లనూ పరిచయం చేసింది. కానీ తాజాగా ఓ ఫీచర్‌ను తొలగించేందుకు ఇన్‌స్టా సిద్ధమైంది. లైవ్ షాపింగ్ ఫీచర్‌ను ఇంట్రడ్యూస్‌ చేయడంతో ఇ-కామర్స్ ప్రపంచంలో కీలకమైన ప్లేయర్‌గా మారిన ఇన్‌స్టా.. కొనుగోలుదారులకు, వ్యాపారాలకు అనుకూలమైన, క్రమబద్ధమైన ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తూ వస్తోంది. అయితే మెటా యాజమాన్యంలోని ఈ సోషల్ మీడియా యాప్ ఈ ఫీచర్‌ను మార్చి 16 నుంచి నిలిపివేయనుంది.

Also Read: Cheteshwar Pujara: 100వ టెస్టు ముంగిట పుజారా.. చిరకాల కోరిక అదేనంట!

ఇన్‌స్టాగ్రామ్ లైవ్ షాపింగ్ ఫీచర్ 2020లో లాంచ్‌ అయింది. వ్యాపారులు తమ ప్రొడక్టులను, సేవలను ప్రదర్శించడానికి అవకాశం కల్పించింది. వాటిని కరోనా సమయంలో కస్టమర్‌లు సులువుగా కొనుగోలు చేసే మార్గాన్ని అందించింది. అప్పటి నుంచి ఈ ఫీచర్ అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులు, స్టోరీలు, సెర్చింగ్‌ పేజీ నుంచి నేరుగా ప్రొడక్టులను కొనుగోలు చేయగల సామర్థ్యాన్ని అందిస్తోంది. వినియోగదారులు కొనుగోలు చేయడానికి ముందు ప్రొడక్ట్‌ ధరలు, వివరణలు, ప్రొడక్ట్‌కు సంబంధించిన ఇమేజెస్‌ చూడవచ్చు. 2022లో US ఇ-కామర్స్ మార్కెట్‌లో సోషల్ మీడియా యాప్‌లు, వెబ్‌సైట్‌ల ద్వారా కేవలం 5 శాతం మాత్రమే షాపింగ్ చేశారని సమాచారం. ఇన్‌స్టాగ్రామ్ తన హోమ్‌పేజీ నుంచి షాప్స్ ట్యాబ్‌ను తీసివేసిన కొద్ది వారాలకే లైవ్ షాపింగ్ ఫీచర్ షట్ డౌన్ అయింది. ప్రస్తుతం Meta ఆర్థిక అస్థిరత మధ్య ఖర్చులను తగ్గించుకోవడానికి, దాని యాప్‌లు, వెబ్‌సైట్‌ల ప్రధాన ఫీచర్స్‌పై దృష్టి పెట్టడానికి మార్గాలను అన్వేషిస్తోంది.

Also Read: Bajaj Chetak: మరింత ఎక్కువ రేంజ్‌తో బజాజ్ చెతక్ ఈ-స్కూటర్..108కి.మీ మైలేజ్‌!