NTV Telugu Site icon

Rahul Gandhi : ఆసక్తికర ఘటన.. రాహుల్‌ నడుస్తున్న చిన్నారికి చెప్పుఊడిపోవడంతో..

Rahul Gandhi Jodo Yatra

Rahul Gandhi Jodo Yatra

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర ఆదివారం కేరళలోని హరిపాడ్ నుంచి తిరిగి ప్రారంభమైంది. ఉదయం 6:30 గంటల తర్వాత ప్రారంభమైన యాత్రలోని అనేక ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. కొన్నింటిలో రాహుల్‌ గాంధీ రోడ్డుకు ఇరువైపులా వేచి ఉన్న ప్రజలను పలకరిస్తూ కనిపించగా, మరికొన్నింటిలో అతను పాదయాత్ర నుండి విరామం తీసుకుంటూ, మార్గంలో ఉన్న హోటల్ నుండి టీ ని ఆస్వాదిస్తూ కనిపించాడు. అయితే జోడో యాత్రలో ఎంతో మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానులు రాహుల్‌ గాంధీతో పాటు పాదయాత్రలో పాల్గొంటున్నారు.

 

అయితే.. ఓ కార్యకర్త తన కుమార్తెతో సహా రాహుల్‌తో పాటు పాదయాత్ర చేస్తుండగా.. ఆ చిన్నారి కాలు చెప్పు ఊడిపోయింది. అయితే.. ఆ చిన్నారి ఇబ్బంది పడుతూనే పాదయాత్ర చేస్తుండటాన్ని గమనించి రాహుల్‌ వెంటనే ఆ చిన్నారి తండ్రిపిలిచి ఆగమంటూ.. వెనువెంటనే తానే ఆ చిన్నారి కాలుకు ఊడిపోయిన చెప్పు స్ర్టిప్‌ను సరిచేశారు. అయితే.. దీంతో అక్కడివారి ఒక్కింత సంభ్రమాశ్చర్యాలకు లోనైయ్యారు. ఆ తరువాత ఆ చిన్నారి చేయిపట్టుకొని రాహుల్‌ గాంధీ పాదయాత్రను పునఃప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను మహిళా కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు నెట్టా డిసౌజా ట్విట్టర్‌లో షేర్ చేశారు.