Infinix Zero 40 5G Launc with AI Features and GoPro Compatibility: చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ‘ఇన్‌ఫినిక్స్’ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. జీరో సిరీస్‌లో భాగంగా ‘ఇన్ఫినిక్స్ జీరో 40’ 5G పేరుతో తాజాగా రిలీజ్ చేసింది. మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో వచ్చిన ఈ ఫోన్‌ను ఏఐ ఫీచర్లతో తీసుకొచ్చింది. ఇన్‌ఫినిక్స్ ఏఐని సమ్మిళితం చేసిన తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. ఏఐ ఎరేజర్, వాల్‌పేపర్ లాంటి మరిన్ని ఏఐ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
ఇన్ఫినిక్స్ జీరో 40 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.27,999 కాగా.. 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.30,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ రిటైల్ స్టోర్‌లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. వైలెట్ గార్డెన్, మూవింగ్ టైటానియం, రాక్ బ్లాక్ రంగు ఎంపికలలో లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై ఫ్లిప్‌కార్ట్ 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం తగ్గింపును కూడా పొందొచ్చు.
ఇన్ఫినిక్స్ జీరో 40 5Gలో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ కర్వ్‌డ్ ఎమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1080×2436 పిక్సెల్స్ రిజల్యూషన్, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్ ఇందులో ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఎస్‌ఓఎస్ 14.5తో వస్తోంది. 2 ఏళ్ల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. వ్లాగ్‌లను రూపొందించడంలో సహాయపడటానికి ప్రత్యేక వ్లాగ్ మోడ్ ఇందులో ఉంది. ఇది గోప్రో మోడ్‌ని కలిగి ఉంటుంది. ఇది యూజర్స్‌కు ఫోన్ నుంచి నేరుగా గోప్రో డివైస్‌ను కనెక్ట్, కంట్రోల్ చేసేందుకు అనుమతిస్తుంది. ఫోన్ డిస్‌ప్లే లైవ్ ఫుటేజీ కోసం మానిటర్‌గా ఉపయోగించవచ్చు.
Also Read: IND vs BAN: చెపాక్‌లో ఎన్నడూ చూడని దృశ్యాలు.. మరి కాన్పూర్ పిచ్ సంగతేంటి?
ఇన్ఫినిక్స్ జీరో 40 స్మార్ట్‌ఫోన్ వృత్తాకార ట్రిపుల్-రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. 108 ఎంపీ ఓఐఎస్ మెయిన్ లెన్స్, 120 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50 ఎంపీ అల్ట్రావైడ్ యూనిట్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 50 ఎంపీ కెమెరా ఉంది. స్టార్రి నైట్, స్టార్ ట్రయిల్ వంటి కెమెరా ఫీచర్‌లు.. గోప్రో కోసం కెమెరా మోడ్ ఉన్నాయి. 50000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ 44 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.