Infinix’s XOS 16 AI: ఇన్ఫినిక్స్ తన ఆండ్రాయిడ్ స్కిన్‌కు సంబంధించి తదుపరి బిగ్ అప్‌డేట్ XOS 16పై పని చేస్తోంది. అధికారిక ప్రకటనకు ముందే టెక్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ఆధారంగా XOS 16కి సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కొత్త వెర్షన్‌లో AI ఆధారిత అనుభవాలు, కాంటెక్స్ట్ అవేర్ ఇంటెలిజెన్స్, విజువల్ డిజైన్ రిఫైన్‌మెంట్ ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నాయి. గత కొన్ని తరాలుగా సాఫ్ట్‌వేర్ విషయంలో ఇన్ఫినిక్స్ మెరుగుదల చూపించినప్పటికీ, XOS 16 సంస్థకు ఇప్పటి వరకు అత్యంత అంబిషియస్ UI అప్‌డేట్‌గా కనిపిస్తోంది. జనరేటివ్ AI టూల్స్, సిస్టమ్ అంతటా స్మార్ట్ సూచనలు, మరింత ఫ్లూయిడ్ & పర్సనలైజ్డ్ డిజైన్ ఈ అప్‌డేట్‌లో భాగం కానున్నాయి.
Read Also: SSMB : మహేశ్ బాబు – సందీప్ వంగా కాంబినేషన్‌లో సినిమా డీటెయిల్స్
Mind Hub:
* XOS 16లోని ముఖ్యమైన కొత్త ఫీచర్ Mind Hub. ఇది వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుని రోజువారీ పనులను సులభతరం చేసే AI పవర్డ్ సెంట్రల్ స్పేస్. ఇది OnePlus Mind Space, Nothing Essential Space తరహాలో పని చేయనుంది. ఈ Mind Hub ద్వారా మెమోలు, రిమైండర్లు, తేదీలు, అడ్రెస్సులు వంటి సమాచారాన్ని లాంగ్ ప్రెస్ లేదా వన్-ట్యాప్‌తో సేవ్ చేయవచ్చు. దీంతో సమాచారం ఆటోమేటిక్‌గా కేటగరైజ్ అవుతుంది. అవసరమైనప్పుడు వెంటనే సెర్చ్ చేసి తిరిగి పొందవచ్చు.
* అదనంగా, స్మార్ట్ యాక్షన్ సూచనలు కూడా అందిస్తాయి:
* తేదీ లేదా టైమ్‌పై లాంగ్ ప్రెస్ చేస్తే షెడ్యూల్ ఆప్షన్లు
* అడ్రెస్సుపై ట్యాప్ చేస్తే నావిగేషన్
* ఈమెయిల్ IDపై సెలెక్ట్ చేస్తే కంపోజ్
* ఫోన్ నంబర్‌పై ట్యాప్ చేస్తే కాల్ ఆప్షన్
* వినియోగదారు ఏమి చేయాలనుకుంటున్నాడో ముందుగానే ఊహించి OS స్పందించడమే దీని లక్ష్యం.
Read Also: VIJAY : జన నాయగన్ సెన్సార్ వివాదం కేసులో నిర్మాతల షాకింగ్ డెషిషన్
ప్రతి చోట AI:
* XOS 16లో AI వాడకం వాయిస్ అసిస్టెంట్‌కే పరిమితం కాదు.. సిస్టమ్ అంతటా విస్తరించిన AI టూల్స్ అందుబాటులోకి రానున్నాయి.
* AI Suggestions Widgets – భోజన సమయాల్లో ఫుడ్ ఆర్డర్ సూచనలు వంటి కాంటెక్స్ట్ అప్డేట్స్
* AI ఆధారిత మెమో క్రియేషన్ – వాయిస్ లేదా లాంగ్ ప్రెస్ ద్వారా
* స్మార్ట్ టెక్స్ట్ పాలిషింగ్ – సోషల్ మీడియా పోస్ట్‌లు, మెసేజ్‌లను మెరుగుపరచడం
* కాంటెంట్ అవేర్ రికమెండేషన్స్ – వినియోగ విధానాల ఆధారంగా సూచనలు
* ఈ ఫీచర్లు వినియోగదారుడిని విసిగించకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో నిశ్శబ్దంగా పనిచేయడం విశేషం.
Nature Design 2.0 & Glow Spaceతో కొత్త లుక్:
* విజువల్‌గా XOS 16లో Nature Design 2.0 అనే కొత్త డిజైన్ లాంగ్వేజ్‌ను ప్రవేశపెట్టారు. దీనికి Glow Space ప్రధాన ఆధారం.
కొత్త డిజైన్ హైలైట్స్:
* సాఫ్ట్ గ్రాడియెంట్స్
* ఫ్లూయిడ్ యానిమేషన్స్
* డెప్త్ బేస్డ్ మోషన్ ఎఫెక్ట్స్.. Rhythm of Time, Gravity Halo వంటి కొత్త లాక్ స్క్రీన్ స్టైల్స్ రోజంతా రంగులు, లేఅవుట్ మారుతూ డైనమిక్ అనుభవం ఇస్తాయి. హోమ్ స్క్రీన్‌లో కూడా క్లీనర్ ఐకాన్స్, మెరుగైన విడ్జెట్ లేయరింగ్ ఉంటుంది.
Read Also: Most Runs In Over: ఓవర్‌లో అత్యధిక పరుగులు.. టీమిండియా బ్యాటర్‌ల ఫుల్ లిస్ట్ ఇదే!
ప్రొడక్టివిటీ & సిస్టమ్ మెరుగుదలలు:
* XOS 16లో అనేక డేలీ-యూజ్ మెరుగుదలలు కూడా ఉన్నాయి:
* లాంగ్ ప్రెస్ షార్ట్‌కట్స్ (మ్యూట్, DND, కెమెరా, ఫ్లాష్‌లైట్)
* NFC ఆధారిత ఇన్‌స్టంట్ ఫైల్ షేరింగ్ (ఐఫోన్‌లతో కూడా)
* బ్యాటరీ సెల్ఫ్-రిపేర్ టెక్నాలజీతో దీర్ఘకాల బ్యాటరీ హెల్త్
* SIM తొలగించినా పనిచేసే మెరుగైన “Find My Device” సెక్యూరిటీ ఫీచర్
గేమింగ్‌పై ప్రత్యేక దృష్టి:
* ఇన్ఫినిక్స్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని XOS 16లో గేమింగ్ ఆప్టిమైజేషన్స్ కూడా ఉన్నాయి:
* 144FPS వరకు హై ఫ్రేమ్‌రేట్ సపోర్ట్
* AI ఆధారిత స్వెట్టీ-హ్యాండ్ రికగ్నిషన్
* వాయిస్‌తో గేమ్ యాక్షన్స్
* మెరుగైన హాప్టిక్ ఫీడ్‌బ్యాక్
* బైపాస్ ఛార్జింగ్‌తో ఓవర్‌హీటింగ్ తగ్గింపు
తొలి అభిప్రాయం: ఇన్ఫినిక్స్‌కు టర్నింగ్ పాయింట్?
* XOS 16 ఒక సాధారణ అప్‌డేట్ కంటే ఇన్ఫినిక్స్ సాఫ్ట్‌వేర్ వ్యూహంలో పెద్ద మార్పుగా కనిపిస్తోంది. Mind Hub, లోతైన AI ఇంటిగ్రేషన్, క్లీనర్ UI ద్వారా హార్డ్‌వేర్‌తో పాటు అనుభవంపైన కూడా పోటీ పడాలనే లక్ష్యాన్ని ఇది సూచిస్తోంది. అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం, XOS 16 ఇన్ఫినిక్స్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని మరింత తెలివైన, వినియోగదారుడికి దగ్గరైన దిశగా తీసుకెళ్లేలా కనిపిస్తోంది.
