Infinix Hot 60 5G+: ఇన్‌ఫినిక్స్ తన తాజా 5G స్మార్ట్‌ఫోన్ అయిన Infinix Hot 60 5G+ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది Hot 60 సిరీస్ లో మరో కొత్త అడిషన్‌గా వచ్చింది. గతంలో విడుదలైన GT 30 Pro తర్వాత వచ్చిన ఈ మొబైల్ ఆకట్టుకునే స్పెసిఫికేషన్లు, అట్రాక్టివ్ ధరతో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ మొబైల్ వివరాలను ఒకసారి చూసేద్దామా..
Read Also:Kota Srinivas Death : ‘కోట’ రాజకీయాలను ఎందుకు వదిలేశాడు..?
ప్రధాన ఫీచర్లు:
డిస్ప్లే: 6.7-అంగుళాల HD+ LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, Panda గ్లాస్ ప్రొటెక్షన్.
ప్రాసెసర్: MediaTek Dimensity 7020 (6nm) చిప్‌సెట్, IMG BXM-8-256 GPU
స్టోరేజ్: 6GB LPDDR5x RAM, 128GB UFS 2.2 స్టోరేజ్ (వర్చువల్ RAM తో కలిపి మరో 6GB వరకు విస్తరించవచ్చు).
సాఫ్ట్ వెర్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15
Read Also:Kota Srinivas Death : నటనతో ఇండస్ట్రీ ఉలిక్కిపడేలా చేశాడు.. ఆర్.నారాయణ మూర్తి కామెంట్స్
కెమెరాలు: 50MP వెనుక కెమెరా (f/1.6), డ్యూయల్ LED ఫ్లాష్, 2K వీడియో రికార్డింగ్.., 8MP ఫ్రంట్ కెమెరా LED ఫ్లాష్‌తో వస్తుంది.
బ్యాటరీ: 5200mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ చార్జింగ్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సప్పోర్ట్ చేస్తుంది.
సెక్యూరిటీ: సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్.
రెసిస్టెంట్: IP64 రేటింగ్ (డస్ట్, వాటర్ రెసిస్టెంట్)
* 90FPS Free Fire గేమింగ్ సపోర్ట్, HyperEngine 5.0 Lite
* One-Tap AI బటన్ – Folax Smart Assistant: వాతావరణం, క్యామెరా, చాట్, యూట్యూబ్ షార్ట్‌కట్‌లు
* Circle to Search ఫీచర్ (సెగ్మెంట్‌లో తొలిసారి)
కనెక్టివిటీ: 5G SA/NSA (n1/n3/n5/n8/n28/n38/n40/n41/n77/n78), డ్యుయల్ 4G VoLTE, Wi-Fi 802.11ac, Bluetooth 5.4, GPS, USB Type-C 2.0, 3.5mm ఆడియో జాక్, బాటమ్ స్పీకర్, FM రేడియో
బరువు: 193 గ్రాములు
ధర: 6GB + 128GB వేరియంట్ రూ.10,499 మాత్రమే..
రంగులు: స్లీక్ బ్లాక్, టండ్రా గ్రీన్, షాడో బ్లూ.
* జూలై 17 నుంచి ఫ్లిప్ కార్ట్, ఇన్‌ఫినిక్స్ ఇండియా వెబ్‌సైట్, ఆఫ్లైన్ స్టోర్లు అందుబాటు ఉంటుంది.
లాంచ్ ఆఫర్లు: అన్ని బ్యాంకుల కార్డులపై రూ.500 తక్షణ డిస్కౌంట్. ఇన్‌ఫినిక్స్ స్టోర్‌లో కొనుగోలు చేస్తే.. రూ. 2,999 విలువైన XE23 TWS ఇయర్‌బడ్స్ ఉచితం (స్టాక్ ఉన్నంత వరకు).
