NTV Telugu Site icon

INDvsAUS 1st Test: రవిశాస్త్రి ఫైనల్ ఎలెవన్ ఇదే..ఓపెనర్లుగా వీరే!

Ra;;

Ra;;

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు గురవారం (ఫిబ్రవరి 9) నాగ్‌పూర్ వేదికగా ప్రారంభంకానుంది. ఇప్పటికే ఇరుజట్లు ప్రాక్టీస్‌లో చెమటోడ్చాయి. భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న పట్టుదలతో ఆస్ట్రేలియా ఉండగా.. ఈ సిరీస్ గెలిచి ఛాంపియన్ షిప్ ఫైనల్లో అడుగుపెట్టాలని రోహిత్ సేన భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు టీమ్స్‌ టెస్టులో ఆడబోయే ఫైనల్ ఎలెవన్‌పై దృష్టిపెట్టాయి. 11మంది గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు మాజీలు కూడా టీమిండియా పైనల్ ఎలెవన్‌పై వారి మాట చెప్పారు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా జట్టు ఇలా ఉంటే బాగుంటుంది అంటూ ఓ టీమ్‌ను ప్రకటించాడు. ఇందులో ఓపెనర్లుగా రోహిత్‌తో పాటు గిల్‌కు చోటిచ్చాడు. బౌలింగ్ విభాగంలో ముగ్గురు స్పిన్నర్లు జడేజా, అశ్విన్, కుల్దీప్‌లను తీసుకోవాలని సూచించాడు. పేసర్లుగా సిరాజ్, షమీకి ప్లేస్ ఇచ్చాడు. ఇక వికెట్ కీపర్లుగా జట్టులో ఉన్న తెలుగోడు కేఎస్ భరత్‌తో పాటు ఇషాన్ కిషన్‌లో ఎవరో ఒకరిని తీసుకోవాలని చెప్పాడు.

రవిశాస్త్రి ఫైనల్ ఎలెవన్

రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్/రాహుల్, పుజారా, కోహ్లీ, సూర్యకుమార్, కేఎస్ భరత్/ఇషాన్ కిషన్, జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, షమీ

ఇకపోతే. టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కూడా తన పైనల్ ఎలెవన్ ప్రకటించాడు. కానీ ఇతడి తుది జట్టులో గిల్, కుల్దీప్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. రోహిత్‌, రాహుల్‌లను డీకే ఓపెనర్లుగా ఎంచుకోగా.. మూడు, నాలుగు స్థానాలకు పుజారా, కోహ్లీలను ఎంపిక చేశాడు. ఐదో స్థానంలో శుభ్‌మన్‌ గిల్‌కు బదులుగా సూర్యకుమార్‌ యాదవ్‌ని తీసుకున్నాడు. ఆరో బ్యాటర్‌గా ఇషాన్‌ కిషన్‌కు బదులు కేఎస్ భరత్ వైపు మొగ్గుచూపాడు. పిచ్‌ స్పిన్‌ అనుకూలంగా ఉంటుందని భావించి ముగ్గురు స్పిన్నర్లకు తన తుది జట్టులో అవకాశం కల్పించాడు డీకే. జడేజా, అక్షర్‌ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లను ఎంచుకుని కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టాడు. సిరాజ్‌, షమీలను పేసర్లుగా తీసుకున్నాడు.

కార్తీక్ ఫైనల్ ఎలెవన్

రోహిత్‌ శర్మ, పుజారా, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్‌, అశ్విన్‌,అక్షర్‌ పటేల్, షమి, సిరాజ్‌.

కాగా.. భారత మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా కూడా తన తుది జట్టుని ప్రకటించాడు. తన జట్టులోనూ గిల్‌కు చోటు దక్కలేదు.

ఆకాశ్ చోప్రా ఫైనల్ ఎలెవన్

రోహిత్, రాహుల్, పుజారా, కోహ్లీ, గిల్/సూర్యకుమార్, కేఎస్ భరత్/ఇషాన్ కిషన్, జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్, షమీ, సిరాజ్‌.

Also Read: INDvsAUS Test: తుది జట్టు కూర్పుపై కెప్టెన్ రోహిత్ ఏమన్నాడంటే!