Site icon NTV Telugu

Indrakeeladri: మీరే ప్రెస్‌మీట్ నిర్వహించుకోండి.. తొలిరోజే ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ వివాదం!

Indrakeeladri Hundi Collection

Indrakeeladri Hundi Collection

తొలిరోజే ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత నూతన చైర్మన్ రాధాకృష్ణ గాంధీ మీడియాతో సమావేశం నిర్వహించారు. మహామండపం ఆరో అంతస్తులో చైర్మన్‌తో సహా కొంత మంది సభ్యులు ప్రెస్‌మీట్‌కి కూర్చున్నారు. అదే సమయంలో ఈఓ శీనా నాయక్ కూడా అక్కడికి వచ్చారు. మీడియా సమావేశం ఉందని నాకు ఎందుకు తెలియజేయలేదని? అంటూ సిబ్బందిపై ఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మీరే ప్రెస్‌మీట్ నిర్వహించుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Also Read: Jagga Reddy: కులం పేరు చెప్పుకుని రాలేదు.. జనం మధ్య నుంచే వచ్చా: జగ్గారెడ్డి

ఈఓ లేకుండా ప్రెస్‌మీట్‌ ప్రారంభించడానికి చైర్మన్ రాధాకృష్ణ గాంధీ సిద్ధమయ్యారు. ఈఓ శీనా నాయక్ సీరియస్‌గా వెళ్లిపోయారని సిబ్బంది చెప్పిన తర్వాత.. 10 నిమిషాలు ఆయన కోసం వేచి ఉండాల్సి వచ్చింది. చివరకు ఈఓ పరిస్థితిని అర్థం చేసుకొని ఆలస్యంగా ప్రెస్‌మీట్‌కి హాజరు అయ్యారు. ప్రెస్‌మీట్‌ సమయంలో చైర్మన్ కుమారుడు కూడా చైర్మన్‌తో కూర్చున్నారు. కాసేపటి తర్వాత తన పొరపాటుని తెలుసుకొని.. ప్రెస్‌మీట్‌ నుంచి వెనక్కి వెళ్లారు. ప్రెస్‌మీట్‌ గురించి నాకు ముందే సమాచారం లేకపోవడం వల్ల ఇలా జరిగింది, వదిలేయండి అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ఈఓ సమాధానం ఇచ్చారు. దాంతో ప్రెస్‌మీట్‌ సజావుగా పూర్తయింది.

Exit mobile version