NTV Telugu Site icon

IND vs AUS: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే జరిగేది అనుమానమే!

Indore Weather Forecast

Indore Weather Forecast

IND vs AUS 2nd ODI Indore Weather Forecast Today: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్ వేదికగా ఈరోజు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ జరగనుంది. ఈ వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇండోర్‌లోనే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో భారత్‌ బరిలోకి దిగనుంది. అయితే భారత్ జోరుకు వరుణుడు అడ్డుకట్ట వేసేలా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే రెండో వన్డేకు వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఆదివారం రోజు ఇండోర్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ ఆరంభానికి ముందు భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇక మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని తెలిపింది. దాంతో మ్యాచ్ సజావుగా సాగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. తొలి వన్డే జరిగిన మొహాలీలో ఆటకు వర్షం అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో కొద్దిసేపు వర్షం కురవడంతో.. అంపైర్లు మ్యాచ్‌ను కొంత సమయం నిలిపివేశారు.

Also Read: Asian Games 2023: సెమీస్‌లో బంగ్లాదేశ్‌ ఓటమి.. ఫైనల్‌కు చేరిన భారత్‌! పతకం ఖాయం

మరోవైపు రెండో వన్డేలో భారత్ మేనేజ్మెంట్ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. కెప్టెన్ కేఎల్ రాహుల్,హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తుది జట్టులో మార్పులు చేయాలనీ భావిస్తున్నట్లు సమాచారం. ఐదో స్థానంలో ఆడుతున్న ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టాలని మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుందట. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ ఉండడంతో.. ఇషాన్ కేవలం మిడిలార్డర్ బ్యాటర్‌గానే ఆడుతున్నాడు. కాబట్టి అతడి స్థానంలో మరో యువ ఆటగాడు తిలక్ వర్మకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారట. ఈ మ్యాచ్ శ్రేయస్‌ అయ్యర్‌కు చాలా కీలకం కానుంది.