Indonesia: ఇండోనేషియా ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం-మెజారిటీ దేశం, 270 మిలియన్లకు పైగా ప్రజలు ఉన్నారు. ప్రస్తుతం ఆ దేశంలోని మధుర ద్వీపంలో తొమ్మిది నెలలుగా మీజిల్స్(తట్టు వ్యాధి) వ్యాప్తి కొనసాగుతోంది. ఈ సంవత్సరం, 2,600 కంటే ఎక్కువ మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారు. అందులో 20 మంది మరణించారు. మహమ్మారిని అరికట్టడంలో సహాయపడటానికి ఆరోగ్య కార్యకర్తలు సుమెనెఫ్ జిల్లాకు వ్యాక్సిన్‌లను పంపిణీ చేస్తున్నారు. అయితే.. ఇక్కడే అతిపెద్ద చిక్కు వచ్చి పడింది. వ్యాక్సిన్ హలాల్ అని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. అందుకే చాలా మంది దానికి స్వీకరించడానికి ఇష్టపడటం లేదు.
READ MORE: E-Luna Prime: మార్కెట్ లోకి కైనెటిక్ గ్రీన్ ఈ-లూనా ప్రైమ్.. సింగిల్ ఛార్జ్ తో 140KM రేంజ్..
ఇండోనేషియాలోని ఒక భాగమైన మదుర ద్వీపంలో ప్రధానంగా ముస్లిం జనాభా ఉంది. అక్కడ మీజిల్స్ వ్యాప్తి మార్చి 2025లో ప్రారంభమైంది. పిల్లల రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల వారు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. టీకాలు వేయని పిల్లలలో ఎక్కువ మరణాలు సంభవించాయి. అందుకే సుమెనెఫ్ జిల్లాలోని ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నారు. వారు గ్రామాల్లో అవగాహన ప్రచారాలను కూడా నిర్వహిస్తున్నారు. కానీ ఈ మహమ్మారి తగ్గే సూచనలు కనిపించడం లేదు. టీకా కవరేజ్ 95% దాటితే మీజిల్స్‌ను పూర్తిగా నిర్మూలించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
READ MORE: Suryakumar Yadav: ఐపీఎల్‌లో పరుగుల వరద.. ఆసియా కప్‌లో మాత్రం గుడ్డు! గణాంకాలు చూస్తే షాకే
మీజిల్స్ వ్యాక్సిన్‌లో స్టెబిలైజర్ ఉంటుంది. దీన్ని పందుల నుంచి తీసుకుంటారు. అయితే.. ముస్లిం సమాజంలో పందులను హరామ్‌గా పరిగణిస్తారు. కాబట్టి చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. దీంతో టీకా పంపిణీ కార్యక్రమం నెమ్మదించింది. అత్యవసర పరిస్థితుల్లో టీకాలు వేయడం అనుమతించదగినదని కొందరు ఇస్లామిక్ పండితులు అంటున్నారు. ప్రాణాలను కాపాడటమే గొప్ప మతం అని ఫత్వా (శాసనం) జారీ చేశారు. అయినప్పటికీ, చాలా కుటుంబాలు టీకాకు దూరంగా ఉన్నాయి. జనాల నమ్మకాలను పరిగణలోకి తీసుకున్న ఇండోనేషియా ప్రభుత్వం హలాల్-సర్టిఫైడ్ వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తెచ్చింది. కానీ పాత నిల్వలు సమస్యగానే మారాయి.
