Telangana Govt: గుడ్‌న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రజల సామాజిక, ఆర్థిక భద్రతే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే అర్హులైన ప్రతి కుటుంబానికి కొండంత అండగా నిలిచేలా ‘ఇందిరమ్మ భీమా’ పథకాన్ని తీసుకువస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారికంగా ప్రకటించారు.
రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ద్వారా రూ.5 లక్షల ఉచిత భీమా రక్షణ కల్పించనున్నారు. కుటుంబంలో ఏదైనా అనుకోని ప్రమాదం లేదా విపత్తు సంభవించినప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడకుండా, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ భీమా మొత్తం ఎంతో దోహదపడుతుంది.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
మహిళా సాధికారతకు పెద్దపీట..
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే మహిళా స్వయం సహాయక సంఘాలకు (పొదుపు సంఘాలకు) రూ.1 లక్ష కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. దీనికి అదనంగా మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఇటీవలే ఆమోదం తెలిపింది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ దూసుకుపోతున్న తెలంగాణ ప్రభుత్వం.. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ‘ఇందిరమ్మ భీమా’ ద్వారా రాష్ట్రంలోని కోటిన్నర కుటుంబాలకు మరింత ధీమాను కల్పించబోతోంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!