NTV Telugu Site icon

Indigo Airlines: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక లోపం.. ప్రయాణికుల అవస్థలు

Indigo Airlines

Indigo Airlines

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి ఓ చేదు వార్త వచ్చింది. కంపెనీ బుకింగ్ సిస్టమ్‌లో లోపం కారణంగా, విమాన కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. ఎయిర్‌లైన్ బుకింగ్ సిస్టమ్ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రభావితం కావడం ప్రారంభమైంది. మధ్యాహ్నం 1.05 గంటలకు సుమారు గంట తర్వాత, కార్యకలాపాలు సజావుగా తిరిగి ప్రారంభమవుతాయని ఆశించారు. అయితే, ఇండిగో బుకింగ్ సిస్టమ్ ఇప్పటికీ డౌన్‌లో ఉంది. వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై కంపెనీ సమాచారం కూడా పంచుకుంది. అయితే ఇప్పటికే ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉన్నారు.

READ MORE: Samsung Galaxy S24 Ultra: ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ సేల్‌లో శాంసంగ్ ఫోన్‌పై భారీ ఆఫర్..

నెట్‌వర్క్ మందగించడం వల్ల సమస్య:
ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈ సమస్యకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. ” ప్రస్తుతం మా నెట్‌వర్క్‌లో సాంకేతక లోపం తలెత్తింది. దీని కారణంగా మా వెబ్‌సైట్, బుకింగ్ సిస్టమ్ ప్రభావితమైంది. ఫలితంగా, కస్టమర్‌లు ఎయిర్‌పోర్ట్‌లో స్లో చెక్-ఇన్‌లు, పొడవైన క్యూలతో సహా పెరిగి ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వావచ్చు. బుకింగ్ సిస్టమ్, ఇండిగో వెబ్‌సైట్‌లో ఈ ఆకస్మిక లోపం మధ్య పరిస్థితిని మెరుగుపరిచేందు మా సిబ్బంది కృషి చేస్తున్నారు.. ప్రయాణీకులందరికీ సహాయం చేయడానికి, వారి ప్రయాణ సమయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా మా విమానాశ్రయ బృందం పని చేస్తుంది. మీకు కలిగిన అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాము.” అని పేర్కొంది. ఈ విషయమై విమానయాన సంస్థలు విడుదల చేసిన ప్రకటనలో సమస్యపై ప్రయాణికులు విచారం వ్యక్తం చేశారు. ఎయిర్‌లైన్స్ కంపెనీ మొత్తం నెట్‌వర్క్‌లో ఈ సాంకేతిక లోపం ఏర్పడింది. ఈ సమస్య కారణంగా ఇండిగో విమాన సర్వీసులు గంటల తరబడి శ్రమించిన తర్వాత కూడా చాలా నెమ్మదిగా పని చేస్తున్నాయి.