7-Seater Cars: 7-సీటర్ కార్లు కావాలా? ఎర్టిగా నుండి బొలెరో వరకు.. ఫ్యామిలీ కార్లపై ఓ లుక్కేయండి

  • ఫ్యామిలీ ట్రావెల్ కోసం 7-సీటర్ వాహనాలు బెస్ట్ ఆప్షన్
  • MPVలు (కారెన్స్, ఎర్టిగా) స్పేస్, కంఫర్ట్ ఇస్తాయి
  • మహీంద్రా బొలెరో నియో
7 Seater Cars

7 Seater Cars

కుటుంబాలకు అత్యంత ప్రజాదరణ పొందిన MPVలు, SUVలు మార్కెట్ లో ఉన్నాయి. ఇవి బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు అందుబాటులో ఉన్నాయి.7-సీటర్ కార్లు ఎందుకు పాపులర్ అంటే.. పెద్ద కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాలు, లాంగ్ ట్రిప్స్, ఫ్యామిలీ ట్రావెల్ కోసం 7-సీటర్ వాహనాలు బెస్ట్ ఆప్షన్. MPVలు (కారెన్స్, ఎర్టిగా) స్పేస్, కంఫర్ట్ ఇస్తాయి. SUVలు (స్కార్పియో N, ఫార్చ్యూనర్) రఫ్ రోడ్లు, స్టైల్ కోసం మంచివి. ప్రస్తుతం నిస్సాన్ గ్రావిటే లాంటి చవకైన మోడల్స్ మార్కెట్‌లో హిట్ అవుతున్నాయి.

Also Read:Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

మారుతి సుజుకి ఎర్టిగా

భారతదేశంలోని మధ్యతరగతి కుటుంబాలలో మారుతి సుజుకి ఎర్టిగా అత్యంత ప్రజాదరణ పొందిన 7-సీటర్ కార్లలో ఒకటి. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే ఇది మంచి శక్తిని అందిస్తుంది. డ్రైవ్ చేయడానికి చాలా సున్నితంగా ఉంటుంది. ఈ కారు దూర ప్రయాణాలకు అనువైనది, తగినంత సీటింగ్, సౌకర్యవంతమైన సీట్లను అందిస్తుంది. ఎర్టిగా ధర రూ.8.80 లక్షల నుండి రూ.12.94 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.

మహీంద్రా బొలెరో నియో

మహీంద్రా బొలెరో నియో అనేది పాత బొలెరో కొత్త వెర్షన్. దీని ఇంటీరియర్ ఇంప్రూమ్ చేశారు. రీ డిజైన్ చేయబడింది. లాంగ్ డ్రైవ్‌ల సమయంలో అలసటను తగ్గించడంలో సహాయపడటానికి ముందు సీట్లలో ఆర్మ్‌రెస్ట్‌లు ఉన్నాయి. టాప్-స్పెక్ మోడల్ ధరలు రూ.8.69 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమై రూ.10.94 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి.

మహీంద్రా బొలెరో

దృఢమైన, నమ్మదగిన వాహనం కోసం చూస్తున్న వారికి మహీంద్రా బొలెరో ఒక ప్రసిద్ధ ఎంపిక. బొలెరో ఇప్పుడు గతంలో కంటే మరింత ఆధునికంగా ఉంది. కొత్త సీట్లు, సొగసైన డిజైన్ లోపలి భాగంలో ప్రీమియం అనుభూతిని కలిగిస్తాయి. ధరలు రూ.7.99 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతాయి.

నిస్సాన్ గ్రావిటాస్

నిస్సాన్ గ్రావిట్ భారత్ లో అత్యంత చౌకైన 7-సీట్ల కార్లలో ఒకటి, దీని ధర రూ.5.65 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇది రెనాల్ట్ ట్రైబర్‌ని చాలా పోలి ఉంటుంది. ఎందుకంటే రెండూ ఒకే టెక్నాలజీపై నిర్మితమయ్యాయి. దీని పొడవు 4 మీటర్ల కంటే తక్కువ, అయినప్పటికీ కంపెనీ 3 వరుసలలో 7 సీట్లను తెలివిగా అమర్చింది.

Also Read:Telangana Govt Key Decision: మార్చి 8న అసెంబ్లీలో భారీ మార్పులు..!

రెనాల్ట్ ట్రైబర్

రెనాల్ట్ ట్రైబర్ చిన్న కారులా కనిపిస్తుంది, కానీ ఇది మూడు వరుసలలో ఏడుగురు వ్యక్తులకు కూర్చునే అవకాశాన్ని అందిస్తుంది. మధ్య సీటును ముందుకు, వెనుకకు జరుపుకోవచ్చు. కొద్దిగా వంచుకోవచ్చు. అత్యంత ఖరీదైన మోడల్ ధరలు రూ.5.76 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమై రూ.8.6 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి.