Site icon NTV Telugu

Love Marriage : ఖండాంతరాలు దాటిన ప్రేమ..

Love Marriage

Love Marriage

Indian Youngster Married American Girl in Hindu Tradition
వారి ప్రేమకు హద్దుల్లేవు. ఎల్లలు దాటిన వారి ప్రేమను ఇరువురి కుటుంబసభ్యుల అంగీకారంతో పండించుకున్నారు. స్నేహాం కాస్తా ప్రేమగా మారింది. ఆ ప్రేమ ఖండంతరాలు దాటి మూడుముళ్ల బందంతో వారిని ఒక్కటి చేసింది. పవిత్ర ప్రేమకు చిహ్నంగా అమెరికా అమ్మాయి,ఇండియా అబ్బాయి ఇద్దరు ఒక్కటయ్యారు. ఇద్దరు కలిసి ఏడడుగులు వేసారు. వరంగల్ కు చెందిన అబ్బాయి అరవింద్ ఉన్నత విద్య ను అభ్యసించటం కోసం అమెరికాకు వెల్లారు.అక్కడ అమెరికాకు చెందిన జెన్నాతో స్నేహం ఏర్పడింది.

అది కాస్త ప్రేమగా మారింది.ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ తల్లిదండ్రులను మెప్పించి, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అమెరికా నుండి అమ్మాయి తల్లిదండ్రులు వరంగల్ కు రావటంతో అంగరంగ వైభవంగా హిందు సాంప్రదాయబద్దంగా పెళ్లి జరిగింది. ఈ వివాహానికి మంత్రి దయాకర్ రావు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Exit mobile version