పారిస్ ఒలింపిక్స్ లో భారత స్టార్ రెజ్లర్ నిషా దహియా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. మహిళల 68 కిలోల బరువు విభాగంలో ఉత్తర కొరియాకు చెందిన పాక్ సోల్ గమ్‌తో తలపడింది. అయితే, ఈ పోటీ నిషాకు చాలా బాధాకరంగా మారింది. మూడు నిమిషాల తర్వాత 8-2తో ఆధిక్యంలోకి వెళ్లిన నిషా.. మ్యాచ్ ముగియడానికి 33 సెకన్లు ఉండగా నిషా గాయపడింది. దీంతో మ్యాచ్ నిలిపివేసి ఆమె చేతికి బ్యాండ్ కట్టారు. అయితే.. బ్యాండ్ కట్టిన గానీ.. నొప్పితోనే తలపడింది.
AP DGP: శాంతి భద్రతలపై డీజీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
చేతికి గాయమైందని అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఉత్తర కొరియా రెజ్లర్ 11 సెకన్లలో నాలుగు పాయింట్లు సాధించడంతో స్కోరు 8-8తో సమమైంది. మ్యాచ్ ముగియడానికి 12 సెకన్లు మిగిలి ఉండగా.. నిషాకు మరింత నొప్పి రావడంతో మ్యాచ్ మళ్లీ ఆగిపోయింది. నిషాకు ఫిజియో ట్రీట్ చేసింది. కానీ నిషాను చూస్తుంటే ఎడమచేతిలో విపరీతమైన నొప్పి ఉన్నట్లు అనిపించింది. ఆ సమయంలో ఆమె ఏడ్చేసింది. స్కోరు 8-8తో సమంగా ఉండి ఉంటే నిషా సెమీఫైనల్‌కు చేరి ఉండేది. అయితే చివరి 12 సెకన్లలో ఉత్తర కొరియా రెజ్లర్ రెండు పాయింట్లు సాధించి 10-8తో మ్యాచ్‌ని కైవసం చేసుకుంది.
Karti Chidambaram: బంగ్లాదేశ్ ఎఫెక్ట్.. పొరుగు దేశాలపైన ప్రభావం ఉంటుంది
ఇలా మ్యాచ్‌లో ఓడిపోవడంతో నిషా ఏడవడం మొదలుపెట్టింది. విజయానికి చాలా దగ్గరగా వచ్చి.. ఇలా వెనుతిరిగినందుకు తీవ్రంగా బాధ పడింది. నిషా 10 పాయింట్లు స్కోర్ చేసి ఉంటే, ఆమె సాంకేతిక ఆధిక్యతతో మ్యాచ్‌లో గెలిచి ఉండేది. నిషా గాయం ఎంత తీవ్రంగా ఉందో తెలియదు. అయితే, ఆమె రెపీచేజ్‌లోకి ప్రవేశించడానికి ఇంకా రెండు రోజుల సమయం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిషా ఆడుతుందా లేదా అన్నది చూడాలి. ఆమె గాయం తీవ్రంగా లేకుంటే, ఆమె రిపీచేజ్ గెలిచి భారత్‌కు మరో పతకాన్ని సాధించే అవకాశం ఉంది.