Site icon NTV Telugu

Indian Railway: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక నాన్ ఏసీ కోచ్‌లలోనూ ఏసీ కోచ్‌ల సౌకర్యాలు..!

Indian Railways

Indian Railways

ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది. రైల్వే స్టేషన్లలో సౌకర్యాలను పెంచడం, రైళ్లలో జనరల్, స్లీపర్ కోచ్‌ల సౌకర్యాలను వంటి సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలో, రైల్వే మరో మార్పు చేయబోతోంది. రైల్వే ఇప్పుడు నాన్-ఏసీ కోచ్‌లకు కూడా ఏసీ కోచ్‌ల సౌకర్యాన్ని ప్రారంభించబోతోంది.

READ MORE: Knife Attack: జీతం అడిగినందుకు డ్రైవర్‌పై కత్తితో దాడి చేసిన సినీ నిర్మాత.. కేసు నమోదు

సుదూర రైళ్ల స్లీపర్ కోచ్ లలో కూడా లిక్విడ్ సోప్ డిస్పెన్సర్ లను (కీప్ హ్యాండ్ వాష్) ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఇప్పటివరకు ఈ సౌకర్యం ఏసీ కోచ్ లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఆన్-బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీస్ తో పాటు అన్ని నాన్-ఏసీ స్లీపర్ రిజర్వుడ్ కోచ్ లలో హ్యాండ్ వాష్ సౌకర్యం కల్పించాలని భారతీయ రైల్వేలు నిర్ణయించాయి.ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీస్ సౌకర్యం ఉన్న రైళ్లలో దీనికి సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జోనల్ రైల్వేలకు ఆదేశాలు జారీ అయ్యాయి. రైళ్లలోని టాయిలెట్లు, స్లీపర్ కోచ్‌ల కారిడార్‌లలో వాష్ బేసిన్‌ల దగ్గర లిక్విడ్ సోప్ డిస్పెన్సర్‌లను ఏర్పాటు చేస్తామని ఓ రైల్వే మెకానికల్ ఇంజనీర్ తెలిపారు. రైలు ప్రారంభమయ్యే ముందు వాటిలో లిక్విడ్ హ్యాండ్ వాష్ నింపుతామని.. మార్గమధ్యలో అయిపోతే, ఉద్యోగి దానిని తిరిగి నింపుతాడని వెల్లడించారు.

READ MORE: Chhattisgarh: బీజాపూర్ నేషనల్ పార్క్‌లో మరో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి

Exit mobile version