NTV Telugu Site icon

Indian Railway : వీళ్ల కక్కుర్తి పాడుగానూ.. రైల్వే బెడ్‌షీట్‌లను లగేజీలో దాచిపెట్టిన కేటుగాళ్లు

New Project (71)

New Project (71)

Indian Railway : భారతీయ రైల్వేలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిలో ప్రయాణీకులు కొన్నిసార్లు రద్దీ గురించి, కొన్నిసార్లు ఆహార లోపాల గురించి మాట్లాడుకోవడం కనిపిస్తుంది. ప్రయాణికులు రైళ్లలో అతి చేసిన సందర్భాలు, అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. వాటిపై సోషల్ మీడియాలో రైల్వేలపై విమర్శలు మొదలయ్యాయి. అయితే, ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది ఎందుకంటే ఈసారి రైల్వే ఉద్యోగి ఒక ప్రయాణీకుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అతను రైల్వే ఆస్తిని అంటే అందులో అందుబాటులో ఉన్న బెడ్‌షీట్‌లను రహస్యంగా తీసుకెళ్తున్నాడు. ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ క్లిప్‌లో ప్రయాగ్‌రాజ్‌లోని రైల్వే ఉద్యోగులు ప్లాట్‌ఫారమ్‌పై ప్రయాణికుల లగేజీని తనిఖీ చేస్తున్నట్లు కనిపిస్తుంది. వారు రైల్వే కంపార్ట్‌మెంట్ల నుండి తెచ్చినట్లుగా కనిపించే బెడ్ షీట్లు, టవల్స్ వంటి వస్తువులను కనుగొన్నారు.

Read Also:Redmi Note 13 pro 5G: రెడ్‌మీ 5G ఫోన్ పై క్రేజీ ఆఫర్.. ఏకంగా రూ. 10 వేల డిస్కౌంట్

“whoismayankk” అనే యూజర్ రెడ్డిట్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చాలా మంది వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. 3,800 కంటే ఎక్కువ కామెంట్స్ వచ్చాయి. నెటిజన్లు కూడా ఆ ప్రయాణీకులను విమర్శిస్తున్నారు. రైల్వే సిబ్బంది ప్రయాణీకుల బ్యాగులను జాగ్రత్తగా తనిఖీ చేసి, దొంగిలించబడిన బెడ్ షీట్లను బయటకు తీస్తున్నట్లు వీడియోలో ఉంది. చాలామంది ప్రయాణీకుడి చర్యలను ఖండిస్తూ శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘ప్రజలు ఇలాంటి చిన్న వస్తువులను కూడా దొంగిలించకుండా ఆపలేకపోవడం సిగ్గుచేటు.’ అంటూ కామెంట్ చేశాడో నెటిజన్. మరొకరు భారత రైల్వేలు నష్టాలను ఎదుర్కోవడానికి ఇదే కారణమన్నారు. ‘రైల్వే మా సౌలభ్యం కోసం ఈ సేవలను అందిస్తుంది. కొంతమంది ప్రయాణీకులు దీనిని సద్వినియోగం చేసుకుంటారు’ అని మరొక నెటిజన్ అన్నారు. మరో నెటిజన్ ఫన్నీగా ఇలా “హోటల్ టాయిలెట్ల మాదిరిగా బెడ్ షీట్లు ఉచితం అని వాళ్ళు భావించి ఉండవచ్చు!” అని కామెంట్ చేశారు. ‘రైల్వేలు బెడ్ షీట్ల కోసం సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవడం ప్రారంభించాలి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

Read Also:TG Bharat: ఎవరికైనా నచ్చినా నచ్చక పోయినా.. ఫ్యూచర్‌ ఈజ్ లోకేష్‌.. కాబోయే సీఎం..