NTV Telugu Site icon

Indian Railway: రైలులో ప్రయాణిస్తున్నారా? ఈ రూల్స్ గురించి తప్పక తెలుసుకోవాలి..

Railways

Railways

రైలు ప్రయాణం చాలా సులువైంది.. సౌకర్య వంతమైంది.. అందుకే ఎక్కువ మంది రైళ్లో ప్రయాణించడానికి ఇష్టపడతారు.. ప్రతిరోజు లక్షలాది మంది రైలు మార్గంలో ఒక చోటి నుంచి మరో ప్రాంతానికి వెళుతున్నారు.. రైలులో ప్రయాణించడానికి టిక్కెట్ ను కొనడం ముఖ్యం.. అలా చేయకపోతే రైల్వే నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఈ రోజు మేము రైల్వేకు చెందిన మరికొన్ని నిబంధనల గురించి మీకు చెప్పబోతున్నాము. పాటించకపోతే, మీరు జరిమానా చెల్లించవలసి ఉంటుంది.. రైలు లో ప్రయాణించే వాళ్లు ఈ రూల్స్ ను తప్పక తెలుసుకోవాలి..

రైలులో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే నేరం.. శిక్షా అర్హులు.. ఆరు నెలల జైలు లేదా గరిష్టంగా రూ. 1,000 జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుంది. జరిమానా కనీస మొత్తం రూ. 250 ఉంటుంది. అపరాధి ప్రయాణించిన దూరానికి టిక్కెట్ ధరకు సరి సమానంగా జరిమానా విధిస్తారు..

అలాగే మీరు మామూలు టిక్కెట్ తీసుకోని స్లీపర్ లో ప్రయానించిన, స్లీపర్ కోచ్ తీసుకొని ఏసీ బోగిలో ప్రయాణిస్తే ఆ చార్జీలను సమానంగా ఫైన్ వేస్తారు.. తప్పక చెల్లించుకోవాలి..

ఇకపోతే ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ను బుక్ చేసుకున్నట్లయితే, ప్రయాణ సమయంలో మీ వద్ద కొంత ఐడీ లేదా గుర్తింపు కార్డు ఉండాలి. మీరు మీ ఐడీని టీటీఈకి ఇవ్వకుంటే, టీటీఈ మిమ్మల్ని టికెట్ లేని టిక్కెట్‌గా పరిగణించి, మీకు జరిమానా విధించవచ్చు..

రైలులో మధ్యపానం, దుమాపానం చేస్తే రైలు నుంచి దింపేస్తారు..అలాగే అతనికి రూ.500 నుంచి 1000 రూపాయలు జరిమానా విధిస్తారు..

యువకులై ఉండి, టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడితే, మీరు కనీసం రూ. 250 జరిమానా లేదా అదనపు ఛార్జీలు లేదా రెండూ చెల్లించాల్సి ఉంటుంది..

రైలులో చైన్ లాగి ఆపితే వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా రూ. 1,000 వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు..

టికెట్ లేదా అనుమతి లేకుండా రైల్వే ట్రాక్‌లు దాటినా లేదా ప్లాట్‌ఫారమ్‌లోకి ప్రవేశించినా, అతనికి రూ. 1,000 జరిమానా లేదా జైలు శిక్ష విధించవచ్చు.. ఈ రూల్స్ ను తప్పక గుర్తుంచుకోవాలి..

Show comments