Site icon NTV Telugu

Indian Police Force : ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్…

Whatsapp Image 2023 10 21 At 10.36.24 Pm

Whatsapp Image 2023 10 21 At 10.36.24 Pm

బాలీవుడ్ లో సింగం సిరీస్ తో దర్శకుడు రోహిత్ శెట్టి వరుసగా సూపర్ హిట్‍లు కొట్టారు. ఇప్పుడు పోలీస్ నేపథ్యంలో సాగే పవర్ ఫుల్ స్టోరీతోనే ఆయన ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.రోహిత్ శెట్టి క్రియేషన్‍లో ప్రస్తుతం ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ వెబ్ సిరీస్ రూపొందుతోంది. భారీ స్థాయిలో ఈ సిరీస్ ఉండనుందని తెలుస్తుంది.. ఈ సిరీస్‍కు రోహిత్ శెట్టి, సుశ్వాంత్ ప్రకాశ్ కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‍ను మేకర్స్ అధికారికంగా వెల్లడించారు..ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ వచ్చే ఏడాది (2024) జనవరి 19వ తేదీన అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍ కానుంది… ఏడు భాగాలుగా ఈ సిరీస్ ఉండనున్నట్లు సమాచారం సిద్ధార్థ మల్హోత్రా ఈ వెబ్ సిరీస్‍లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్, శ్వేత తివారి, నికితిన్ ధీర్, రితురాజ్ సింగ్, ముకేశ్ రిషి, లలిత్ పరిమో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.”.

రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న ఉత్కంఠభరితంగా సాగే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం” అంటూ అమెజాన్ ప్రైమ్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సిరీస్‍ తో రోహిత్ శెట్టి మాత్రమే కాకుండా సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఓటీటీలోకి డెబ్యూట్ చేస్తున్నారు.”ఇండియన్ పోలీస్ పరాక్రమం, త్యాగం, ధైర్యాన్ని చూపించే ఈ యాక్షన్ సిరీస్‍ను రూపొందించేందుకు నాతో కలిసి పని చేసిన నటీనటులు మరియు సాంకేతిక సిబ్బంది పట్ల నేను గర్విస్తున్నా. నా తొలి డిజిటల్ ప్రాజెక్ట్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియోతో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు ఉత్కంఠభరితమైన ఎంటర్‌టైన్‍మెంట్ ను అందిస్తాం” అని రోహిత్ శెట్టి పేర్కొన్నారు. అలాగే సింగం లైనప్‍లో ‘సింగం రిటర్న్’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవ్‍గన్, కరీనా కపూర్, దీపికా పదుకొణ్ మరియు టైగర్ ష్రాఫ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version