బాలీవుడ్ భారీ యాక్షన్ మూవీ లు తీయడంలో డైరెక్టర్ రోహిత్ శెట్టి దిట్ట. ముఖ్యంగా పోలీసుల నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన సింగం సిరీస్, సింబా, సూర్యవంశీ లు మాస్ ప్రియులను బాగా అలరించాయి.. అంతేకాదు భారీ విజయాన్ని కూడా అందుకున్నాయి. ఆయన ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలు వెబ్ సిరీస్ లు బాగా ఆకట్టుకున్నాయి.. ఇప్పుడు ఓ పవర్ ఫుల్ యాక్షన్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈయన దర్శకత్వంతో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ డ్రామా ఇండియన్ పోలీస్ ఫోర్స్.
బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ మల్హోత్రా, సీనియర్ నటి శిల్పాశెట్టి, వివేక్ ఓబెరాయ్, శ్వేతా తివారి, ముకేష్ రిషి, నికితిన్ ధీర్, రితురాజ్ సింగ్, లలిత్ పరిమో, శరద్ ఖేల్కర్.. ఇలా పలువురు ప్రముఖ నటీనటులు ఈ వెబ్ సిరీస్‌లో నటిస్తుండడం.. ఈ మధ్య షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మేకర్స్ ఇండియన్ పోలీస్ ఫోర్స్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు.
ప్రజల రక్షణ కోసం పోలీసులు చేస్తున్న సేవలను చక్కగా చూపించారు.. నిత్యం జరుగుతున్న పరిస్థితుల ఆధారంగా వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు రోహిత్ శెట్టి. రోహిత్‌శెట్టితోపాటు సుశ్వంత్ ప్రకాష్ దర్శకుడిగా వ్యవహరించిన ఈ ఈ సిరీస్‌లో మొత్తం ఏడు ఎపిసోడ్స్ ఉండనున్నాయి. . రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్స్ , రోహిత్ శెట్టి పిక్చర్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ లో అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ కుమార్ , రణ్‌వీర్ సింగ్ స్పెషల్ రోల్స్‌లో కనిపించనుండడం విశేషం..
The hunt begins 19th January onwards…#IndianPoliceForceOnPrime,
Trailer Out Now#RohitShetty @TheShilpaShetty @vivekoberoi @nikitindheer @itsishatalwar @RSPicturez @RelianceEnt @TSeries #SushwanthPrakash @DJLIJO @Dj_Chetas @PrimeVideoIN pic.twitter.com/5nUH4VfAgT— Sidharth Malhotra (@SidMalhotra) January 5, 2024