Australia: ‘‘అవును, నేనే నా భార్యను చంపాను, కానీ ఇది హత్య కాదు’’ అని ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తి వాదించాడు. తన భార్యను చంపిన కేసులో 42 ఏళ్ల వ్యక్తి కోర్టులో చంపినట్లు అంగీకరించాడు. అయితే తాను హత్య(Murder)కు పాల్పడలేదని చెప్పాడు. అయితే, ఇది మ్యాన్‌స్లటర్ (Manslaughter)(ఉద్దేశపూర్వకంగా చేయని హత్య) అని అతను తన వాదనల్ని వినిపించాడు. నిందితుడు విక్రాంత్ ఠాకూర్ అడిలైడ్ మేజిస్ట్రేట్ కోర్టులో తన వాదనల్ని వీడియో లింక్ ద్వారా వెల్లడించారు. హత్య, ఉద్దేశపూర్వకంగా చేయని హత్యకు సంబంధించిన శిక్షల్లో తేడాల ఉంటాయి. సాధారణం హత్యకు యావజ్జీవం, మరణశిక్షలు విధిస్తే, ఉద్దేశపూర్వకంగా చేయని హత్యకు తక్కువ శిక్ష పడే అవకాశం ఉండటంతో నిందితుడు విక్రమ్ ఠాకూర్ ఈ వాదనను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
Read Also: Hindu Student: “బొట్టు” పెట్టుకున్నాడని.. లండన్ స్కూల్‌లో హిందూ విద్యార్థిపై వివక్ష..
ఈ ఘటన 2025 డిసెంబర్ 21న దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలోని నార్త్‌ఫీల్డ్‌లో జరిగింది. ఇంట్లో వాగ్వాదం జరుగుతుందనే సమాచారం అందడంతో పోలీసులు రాత్రి 8.30 గంటలకు అక్కడికి చేరుకున్నారు. విక్రమ్ ఠాకూర్ భార్య సుప్రియా ఠాకూర్(36) ఇంట్లో అచేతన స్థితిలో కనిపించింది. పోలీసులు సీపీఆర్ ద్వారా ఆమె ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు, మృతురాలు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్ 22న ఠాకూర్ విచారణ తర్వాత, విచారణను 16 వారాల పాటు వాయిదా వేశారు. అయితే, ప్రాసిక్యూటర్లు డీఎన్ఏ విశ్లేషణ, పోస్టుమార్టం నివేదికతో సహా మరిన్ని ఆధారాల కోసం ఎదురుచూస్తున్నారు.
