NTV Telugu Site icon

Lottery Win: అదృష్టమంటే ఇతడిదే..! ఫ్రీ లాటరీ టికెట్‌తో కోట్లు వచ్చిపడ్డాయి!

Free Ticket

Free Ticket

కొంతమందికి అదృష్టం భలే కలిసొస్తుంటుంది. కొందరి జీవితాలు ఊహించని విధంగా మారుతుంటాయి. అనూహ్యంగా ఓ భారతీయుడి కుటుంబానికి అదృష్టం తలుపుతట్టింది (Lottery Win). ఎక్కడా? ఏంటో.. తెలియాలంటే ఈ వార్త చదవండి.

 

బిగ్ టికెట్ అబుదాబీ వీక్లీ డ్రాలో భారతీయ వలసదారు రాజీవ్ రూ. 33 కోట్ల ఫ్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. గత మూడేళ్లుగా రాజీవ్ బిగ్ టికెట్ డ్రాలో పాల్గొంటున్నాడు. రాజీవ్ ప్రస్తుతం అల్ ఐన్‌లోని ఆర్కిటెక్చరల్ సంస్థలో పనిచేస్తున్నాడు. రాజీవ్.. తన భార్య, పిల్లలపై లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. ఈసారి మాత్రం అదృష్టం లభించింది. ఏకంగా రూ.33 కోట్లు గెలుచుకున్నాడు.

 

కేరళ (Kerala)కు చెందిన రాజీవ్‌ (Rajeev Arikkatt) కొన్నేళ్లుగా యూఏఈ(UAE)లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజీవ్‌ గత మూడేళ్లుగా బిగ్‌ టికెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈసారి ఆయనకు ఆరు టికెట్లు లభించాయి. బిగ్‌ టికెట్‌పై ఈసారి స్పెషల్ ఆఫర్ లభించింది. రెండు టికెట్లు కొంటే నాలుగింటిని ఉచితంగా పొందాడు. రాజీవ్, అలాగే తన భార్య పేరు మీద 7, 13 నంబర్లతో ఉన్న టికెట్లు కొన్నారు. ఆ టికెట్లు కూడా పిల్లల పుట్టినరోజు తేదీలతో తీసుకున్నారు. ఒరిజనల్‌గా రెండు టికెట్లు కొంటే నాలుగు టికెట్లు ఉచితంగా లభించాయి. ఆ ఫ్రీ టికెట్‌లో ఒకటి విజయం సాధించింది. లాటరీ తగలినట్లు ప్రకటన చేయగానే కుటుంబమంతా సంతోషంతో ఉప్పొంగిపోయారు. సుమారు రూ.33 కోట్లు గెలుచుకున్నారు.

తాను గెల్చుకున్న రూ.33 కోట్లు ఎలా ఖర్చు పెట్టాలన్న దానిపై ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాజీవ్ తెలిపారు. తన ఉదార హృదయాన్ని మాత్రం చాటుకున్నాడు. ఆ డబ్బును మరో 19 మందితో సమానంగా పంచుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.