NTV Telugu Site icon

Olympics 2024: వామ్మో.. ఒలంపిక్స్ కోసం ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతోందా..?

Paris Olympics 2024

Paris Olympics 2024

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుండి ప్రారంభంకానున్నాయి. ఇందులో భారతదేశం నుండి మొత్తం 117 మంది క్రీడాకారులు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. గత టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మొత్తం 7 పతకాలు సాధించింది. దింతో మరోసారి భారత జట్టు పతకాలు పెంచుకోవాలని భావిస్తోంది. పారిస్ ఒలింపిక్స్ సన్నాహకాల కోసం భారత ప్రభుత్వం మొత్తం రూ. 417 కోట్లు వెచ్చించింది. ఇందుకు సంబంధించి వివరాలను ఓసారి పరిశీలిద్దాం.

Broccoli: లైంగిక జీవితాన్ని మెరుగుపరచుకోవాలా.? ఇలా చేయకతప్పదు..

పారిస్ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ నుండి అత్యధికంగా 29 మంది ఆటగాళ్లను భారత్ కలిగి ఉంది . భారత ప్రభుత్వం అథ్లెటిక్స్ కోసం అత్యధికంగా రూ. 96.08 కోట్లు ఖర్చు చేసింది. ఒలింపిక్స్‌ చరిత్రలో అథ్లెటిక్స్‌లో భారత్‌ కేవలం 3 పతకాలు మాత్రమే సాధించింది. గత ఎడిషన్‌లో నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రోలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. ఇక బ్యాడ్మింటన్ కోసం 72.02 కోట్లు ఖర్చు చేసింది. ఈసారి బ్యాడ్మింటన్‌లో మొత్తం 7 మంది భారత క్రీడాకారులు పాల్గొననున్నారు. ఒలింపిక్స్ చరిత్రలో ఈ గేమ్‌ లో భారత్ మొత్తం 3 పతకాలు సాధించింది. పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, రియో ​​ఒలింపిక్స్ (2016)లో రజత పతకం సాధించింది. అంతకు ముందు సైనా నెహ్వాల్ లండన్ ఒలింపిక్స్ 2012లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.

Hardik Pandya Captaincy: నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు.. హార్దిక్‌ టీ20 కెప్టెన్సీపై భారత మాజీ క్రికెటర్!

ఇక బాక్సింగ్‌లో రూ.60.93 కోట్లు, షూటింగ్‌లో రూ.60.42 కోట్లు ఖర్చు చేసింది. ఒలింపిక్ చరిత్రలో బాక్సింగ్‌ లో భారత్ మొత్తం 3 పతకాలు సాధించింది. 2008లో విజేందర్ సింగ్, 2012లో మేరీకోమ్ , 2020లో లోవ్లినా బోర్గోహైన్ కాంస్య పతకాలు సాధించారు. షూటింగ్‌లో భారత్ మొత్తం 4 పతకాలు సాధించింది. ఇందులో అభినవ్ బింద్రా స్వర్ణం కూడా ఉంది. ఇకపోతే హాకీకి రూ.41.29 కోట్లు, ఆర్చరీకి రూ.39.18 కోట్లు, రెజ్లింగ్‌కు రూ.37.80 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇప్పటి వరకు ఒలింపిక్ చరిత్రలో భారత్ హాకీలో మొత్తం 12 పతకాలు సాధించగా.. అందులో 8 బంగారు పతకాలు ఉండడం గమనార్హం. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. భారత్ ఇప్పటివరకు ఆర్చరీలో పతకం సాధించలేకపోయింది. ఈసారి 6 మంది భారతీయ క్రీడాకారులు పాల్గొనడం ద్వారా చరిత్రను మార్చాలనుకుంటున్నారు. రెజ్లింగ్‌లో భారత్‌కు 2 రజతాలు సహా మొత్తం 7 పతకాలు వచ్చాయి.

Mukhesh Ambani : ముఖేష్ అంబానీకి భారీ షాక్ ఇచ్చిన బడ్జెట్

ఇక అలాగే వెయిట్ లిఫ్టింగ్ కోసం రూ.26.98 కోట్లు ఖర్చు చేశారు. ఒలింపిక్స్‌లో ఈ క్రీడలో భారత్ మొత్తం 2 పతకాలు సాధించింది. 2000లో కరణం మల్లీశ్వరి కాంస్యం, 2020లో మీరాబాయి చాను రజతం గెలుచుకున్నారు. దీంతో పాటు టేబుల్ టెన్నిస్‌పై రూ.12.92 కోట్లు, జూడోపై రూ.6.30 కోట్లు, స్విమ్మింగ్‌ పై రూ.3.90 కోట్లు, రోయింగ్‌ పై రూ.3.89 కోట్లు, సెయిలింగ్‌ పై రూ.3.78 కోట్లు, గోల్ఫ్‌ పై రూ.1.74 కోట్లు, టెన్నిస్‌ పై రూ.1.67 కోట్లు, గుర్రపు స్వారీపై 0.95 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

Show comments