Site icon NTV Telugu

Bhaichung Bhutia: రాజకీయాలకు ఫుట్‌బాల్ దిగ్గజం భైచుంగ్ గుడ్‌బై

Peke

Peke

ప్రముఖ భారత ఫుట్‌బాల్ దిగ్గజం భైచుంగ్ భూటియా రాజకీయాలకు స్వస్తి చెప్పారు. ఇటీవల జరిగిన సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు భైచుంగ్ భూటియా మంగళవారం ప్రకటించారు. 2014లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ఆయన డార్జిలింగ్ లోక్‌సభ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2018లో హమ్రో సిక్కిం పార్టీని స్థాపించాడు. గతేడాది పవన్ చామ్లింగ్ నేతృత్వంలోని ఎస్‌డీఎఫ్ పార్టీలో విలీనం చేశాడు.

ఇది కూడా చదవండి: TG Vishwa Prasad: పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకంగా అభినందించిన నిర్మాత విశ్వప్రసాద్

రాజకీయాల్లో తాను మన్నన పొందలేనని భూటియా చెప్పారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. పదేళ్లలో ఆరోసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. బార్‌ఫుంగ్‌లో 4,346 ఓట్ల తేడాతో భూటియా ఓడిపోయారు. సిక్కిం ప్రజల కోసం వాగ్దానాలు అమలయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి: CM Revanth: తెలంగాణ ప్రయోజ‌నాలే ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్..

Exit mobile version