Indian Coast Guard: బంగాళాఖాతంలో చిక్కుకున్న బంగ్లాదేశ్ మత్స్యకారులను భారత కోస్ట్ గార్డ్ రక్షించింది. సిత్రాంగ్ తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో జాలర్ల పడవ చిక్కుకుంది. తుఫాన్ కారణంగా జాలర్ల పడవ సముద్రంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో జాలర్లు పడవ శిథిలాలను పట్టుకుని నీటిపై తేలియాడారు. వారిని గమనించిన కోస్ట్‌గార్డులు మొత్తం 20 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులను రక్షించారు. భారత్, బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్‌ల మధ్య ఉన్న అవగాహన ఒప్పందానికి అనుగుణంగా వారిని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్‌కు అప్పగించాలని యోచిస్తున్నారు.
సోమవారం రాత్రి నుంచి బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో 35 మందికి పైగా చనిపోయారు. శక్తివంతమైన సిత్రాంగ్ సైక్లోన్ బంగ్లాదేశ్ తీరాన్ని దాటడంతో ఆ దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. తుఫాను ప్రభావాలను నిశితంగా పరిష్కరిస్తున్న బంగ్లాదేశ్ అధికారులు వాతావరణ సూచన ప్రకారం తీర ప్రాంతాల ప్రజలను సకాలంలో తరలించడం వంటి అవసరమైన అన్ని సన్నాహాలను చేపట్టారు. బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్ తుఫాన్ విళయతాండవం చేస్తోంది. 15 తీరప్రాంత జిల్లాల్లో సుమారు 8 మిలియన్ల మంది ప్రజలు విద్యుత్తు లేకుండా చీకట్లోనే మగ్గుతున్నారు. దాదాపు 10,000 ఇళ్లు దెబ్బతిన్నాయని, 6,000 హెక్టార్ల (15,000 ఎకరాలు) పంటలు నాశనమయ్యాయని బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది. వేల సంఖ్యలో మత్స్యకార ప్రాజెక్టులు కూడా కొట్టుకుపోయాయి. బంగ్లాదేశ్ తుఫాన్ వల్ల విద్యాసంస్థలను మూసివేశారు. రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది.
Arvind Kejriwal: కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలు ముద్రించాలి..
సిత్రాంగ్ తుఫాన్ ప్రభావం భారత్‌లోని అస్సాంపై కూడా పడింది. తుఫాను కారణంగా సంభవించిన వరదల వల్ల 83 గ్రామాలకు చెందిన దాదాపు 1100 మంది ప్రజలు ప్రభావితమైనందున అస్సాంలో కూడా పరిస్థితి భయంకరంగా ఉంది. అస్సాంలో సిత్రాంగ్ తుఫాను కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం, తుఫాను కారణంగా 1146 మంది ప్రభావితమయ్యారు.