బ్యాంకులో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే గుడ్ న్యూస్.. ప్రముఖ ఇండియన్ బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం..మార్చి 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయ్యింది.. ఏప్రిల్ 1 వరకు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ www.indianbank.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల వివరాలు.. 146
వివరాలు: ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 146 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు..
అప్లికేషన్ ఫీజు..
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులైన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.175. మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1000. చెల్లించాల్సి ఉంటుంది..
ఎలా అప్లై చేసుకోవాలంటే?
ముందుగా ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ www.indianbank.in ను ఓపెన్ చేయండి.
హోం పేజీలో కనిపించే career tab పై క్లిక్ చేయండి.
“స్పెషలిస్ట్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ – 2024” పై క్లిక్ చేయండి.
స్క్రీన్ పై కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
“Click here for New Registration” లింక్ పై క్లిక్ చేయండి.
రిజిస్టర్ చేసుకుని, అప్లికేషన్ ఫామ్ ను ఫిలప్ చేయండి.
అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.
ఆన్ లైన్ లో ఫీజు చెల్లించండి..
ఆ తర్వాత ప్రింట్ తీసుకోండి..
ఈ ఉద్యోగాల పై ఏదైన సందేహాలు అధికార వెబ్ సైట్ లో చూడవచ్చు..